Begin typing your search above and press return to search.

బిగ్‌ బాస్: ఇలాంటి డ‌బ్బా గేమ్స్ మ‌న‌కే కాదు!

By:  Tupaki Desk   |   2 Nov 2019 5:16 AM GMT
బిగ్‌ బాస్: ఇలాంటి డ‌బ్బా గేమ్స్ మ‌న‌కే కాదు!
X
ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో మాస్ వ‌ర్గాల్లో క్రేజ్ ని సొంతం చేసుకున్నరియాలిటీ షో బిగ్‌ బాస్‌. క్రేజ్ తో పాటు ఘాటైన‌ విమ‌ర్శ‌ల్ని కూడా ఎదుర్కొంటోంది. బిగ్ బాస్ దేశ‌వ్యాప్తంగా ఆద‌ర‌ణ పొందినా సాంప్ర‌దాయ వాదుల నుంచి సూటిగా విమ‌ర్శ‌లు త‌ప్ప‌డం లేదు. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం షోలో కంటెస్టెంట్ ల‌కు ఇస్తున్న త‌ల‌తిక్క టాస్క్ లే. డ‌బ్బా గేమ్స్‌ ని ఆడిస్తూ చిత్ర విచిత్ర‌మైన టాస్క్ ల‌తో వీక్ష‌కుల స‌హ‌నానికి ప‌రీక్ష‌పెడుతున్నార‌న్న‌ది కొంద‌రు సాంప్ర‌దాయ‌వాదుల‌ వాద‌న‌. అయితే ఇది ఒక్క తెలుగు బిగ్ బాస్ షోకే కాదు దేశ వ్యాప్తంగా వివిధ భాష‌ల్లో ర‌న్న‌వుతున్న బిగ్‌బాస్ షోస్ లోనూ ఇదే తంతు... ఇదే తీరు... అక్క‌డా ఇదే త‌ర‌హా బుర్ర‌ తిరిగే టాస్క్‌ల‌ తో చిర్రెత్తిస్తున్నారు. దీంతో ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించే వారికి క్రియేటివిటీ వుందా? అన్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఏ ప్రాతిపాదిక‌న వీక్ష‌కుల్ని ఎంట‌ర్ టైన్ చేయాల‌ని బిగ్ బాస్ టాస్క్ ల‌ని డిజైన్ చేస్తున్నారో అర్థం కావ‌డం లేద‌ని చాలా మంది సోష‌ల్ మీడియా వేదిక‌గా దుమ్మెత్తిపోస్తున్నారు. ప‌లువురు అయితే ఘాటుగా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. టాస్క్ ల పేరుతో కుప్పిగంతులేయిస్తూ రొడ్డ కొట్టుడు అర్థం ప‌ర్థం లేని గేమ్స్ ని కంటెస్టెంట్ ల చేత ఆడిస్తూ జ‌నం స‌హ‌నాన్ని ప‌రీక్షిస్తున్నారు. ఇవి ర‌క్తి క‌ట్టించ‌క‌పోగా జ‌నాల టైమ్ ని వేస్ట్ చేస్తూ స‌హ‌నానికి ప‌రీక్షపెడుతున్నాయి. ఈ గేమ్స్ లో అప్పుడ‌ప్పుడు వ‌చ్చే మెరుపుల కోసం గంట‌ల కొద్దీ స‌మ‌యాన్ని వెచ్చించాల్సిన ప‌రిస్థితి ఉంది. వంద రోజులకు మించి వీక్ష‌కుల విలువైన స‌మ‌యాన్ని హ‌రిస్తున్నారు. ఇక బాలీవుడ్ లో వ‌చ్చే బిగ్ బాస్ షో ఇలాంటి చ‌వ‌క‌బారు టాస్క్ ల‌కు ప‌రాకాష్ట‌గా మారింది. ఇటీవ‌లే తెలుగు షోలోనూ ఈ టాస్క్ ల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.

ఇక ఈ టాస్క్ ల్లో నేటివిటీ కూడా మిస్స‌య్యింది. తెలుగు నాట ఆట‌లు అంటే కోతిక‌మ్మ‌చ్చి.. గూటి బిళ్ల‌.. క‌బడ్డీ వ‌గైరా వ‌గైరా. ఆడాళ్లు ఆడుకునే ఆట‌లు అయితే ఇంకా ఎంతో ఇంట్రెస్టింగ్ గానూ ఉంటాయి. ఇవేవీ తెలుగు నేటివిటీ గేమ్స్ లో అస్స‌లు క‌నిపించ‌వు. అందుకే సంప్ర‌దాయాన్నిమంట‌గ‌లిపే ఈ జాడ్యం ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌ని ఎప్పుడు వీడుతుందోనన్న విమ‌ర్శా ఎదుర‌వుతోంది. ఇలా అంటే బిగ్‌ బాస్ ఫ్యాన్స్ హ‌ర్ట్ అవుతారో ఏమో తెలియ‌దు కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం బిగ్‌బాస్ ప‌ట్ల జ‌నాల‌కున్న ఫీలింగ్ మాత్రం ఇదే. ఒక కోణంలో ప‌రిశీలించి చూస్తే బుల్లితెర‌ను భ్ర‌ష్టు ప‌ట్టిస్తున్న అతి దిగ‌జారుడు పాశ్చాత్య‌ రియాలిటీ షో ఇదేన‌ని సాంప్ర‌దాయ వాదుల కోణంలో విశ్లేష‌ణ సాగుతోంది. అంత‌ స‌మ‌యం కేటాయించి బాగా చ‌దువుకుంటే ఐఏఎస్-ఐపీఎస్ అవ్వొచ్చు. కొన్ని కార్పెరెట్ల టీర్పీ దాహం.. యువ‌త‌రం విలువైన స‌మ‌యాన్ని దారుణంగా హ‌రించేస్తోంది అంటూ ప‌లువురు విశ్లేషిస్తున్నారు.