Begin typing your search above and press return to search.

'బిగ్ బాస్' బ్రేకప్ బ్యూటీ హీరోయిన్ గా?

By:  Tupaki Desk   |   21 Jan 2022 6:30 AM GMT
బిగ్ బాస్ బ్రేకప్ బ్యూటీ హీరోయిన్ గా?
X
బిగ్ బాస్ ఫేం.. సోష‌ల్ మీడియా స్టార్ దీప్తి సునైనా గ‌త కొంత‌కాలంగా మీడియా క‌థ‌నాల్లో హైలైట్ గా మారుతున్న సంగ‌తి తెలిసిందే. తన బాయ్ ఫ్రెండ్ షణ్ముఖ్ జస్వంత్ నుంచి విడిపోయినప్పటి నుండి ఆమె అభిమానులు నిరంత‌రం ఆవేద‌న‌ను వ్య‌క్త‌ప‌రుస్తున్నారు. అయితే ఒక బ్యాడ్ న్యూస్ వెంటే మ‌రో గుడ్ న్యూస్ ఉంటుందంటారు. దీప్తి సాధ్య‌మైనంత తొంద‌ర్లోనే వెండితెరకు పరిచయం కాబోతోందని తాజాగా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

దీప్తి చాలా కాలం క్రితమే హీరోయిన్ గా అరంగేట్రం చేయాలని భావించినా కొన్ని వ్యక్తిగత సమస్యల కారణంగా ఆగిపోయిందని క‌థ‌నాలొచ్చాయి. ప్ర‌స్తుతం ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ల‌కు ట‌చ్ లో ఉంద‌ని తొంద‌ర్లోనే అనౌన్స్ మెంట్లు ఉంటాయ‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. దీప్తితో వెబ్ సిరీస్ చేయడానికి ఒక టాప్ ప్రొడక్షన్ హౌస్ సిద్ధమవుతోందని కూడా స‌మాచారం. ప్రముఖ యువ హీరో సరసన నటించే అవకాశం ఉంద‌ని కూడా తెలుస్తోంది. నిజానికి దీప్తి ఇప్ప‌టికే రెండు సినిమాల్లో న‌టించింది. కానీ అవేవీ క్రైసిస్ వ‌ల్ల చిత్రీక‌ర‌ణ‌లు పూర్తి చేసుకోలేదు. ఇది బ్యాడ్ టైమ్ అని చెప్పాలి. టిక్ టాక్ వీడియోలు - కవర్ సాంగ్ లతో పాపుల‌రైన ఈ బ్యూటీ న‌టిగా ఎదిగాల‌న్న ప్ర‌య‌త్నంలో ఉంది. హారిక హాసిని క్రియేషన్స్ మూవీతో త‌న బోయ్ ఫ్రెండ్ ష‌ణ్ముఖ్‌ వెండితెరపై హీరోగా పరిచయం అవుతున్నారు.