Begin typing your search above and press return to search.

బోల్డ్ పోస్టర్ తో కమిట్‌మెంట్ ఇచ్చేసిన బిగ్ బాస్ బ్యూటీ..!

By:  Tupaki Desk   |   29 July 2022 12:00 PM GMT
బోల్డ్ పోస్టర్ తో కమిట్‌మెంట్ ఇచ్చేసిన బిగ్ బాస్ బ్యూటీ..!
X
తెలుగమ్మాయి తేజస్వి మదివాడ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరంలేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి.. ఆ తరవాత రోజుల్లో హీరోయిన్ గా మారింది. ఈ క్రమంలో 'బిగ్ బాస్' రియాలిటీ షోతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. ఆటపాటలు, కోపతాపాలతో పాటుగా గ్లామర్ ట్రీట్ అందిస్తూ హౌస్ ని హీటెక్కించింది. చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు ''కమిట్మెంట్'' అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

తేజస్వి మదివాడ - అన్వేషి జైన్ - సీమర్ సింగ్ - తనిష్క్ రాజన్ - అమిత్ తివారి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ''కమిట్‌మెంట్''. లవ్ - డ్రీమ్ - హోప్ - ఫైట్ అనేది దీనికి ట్యాగ్ లైన్. 'హైదరాబాద్ నవాబ్స్' ఫేమ్ లక్ష్మీకాంత్ చెన్నా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రెండేళ్ల క్రితమే పూర్తైన ఈ సినిమా కరోనా పాండమిక్ కారణాలతో విడుదలకు నోచుకోలేదు. అయితే ఇప్పుడు పరిస్థితులు అనుకూలించడంతో మేకర్స్ రిలీజ్ కు రెడీ చేశారు.

'కమిట్మెంట్' చిత్రాన్ని ఆగస్ట్ 19న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. 'రండి.. థియేటర్లలో ఈ బోల్డ్, రొమాంటిక్, ఎంటర్టైన్మెంట్ కి "కమిట్" అవుదాం' అంటూ ఓ బోల్డ్ పోస్టర్ ని ఆవిష్కరించారు. ఇందులో పొట్టి పొట్టి దుస్తుల్లో ఉన్న నలుగురు హీరోయిన్లు.. కాళ్ళు గోడకు ఆనించి గ్లామర్ షో చేస్తూ కనిపిస్తున్నారు.

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ పై లైంగిక వేధింపులతో పాటు పలు రంగాల్లో మహిళలపై చోటుచేసుకొంటున్న వేధింపులే కథాంశంగా 'కమిట్మెంట్' చిత్రాన్ని రూపొందించామని మేకర్స్ చెబుతున్నారు. అప్పట్లో ఈ సినిమా టీజర్లు  పోస్టర్లు పెద్ద వివాదం సృష్టించాయి. లేటెస్టుగా వదిలిన ట్రైలర్ కూడా కాంట్రవర్సీగా మారింది.

'కమిట్ మెంట్' ట్రైలర్.. లిప్ లాక్స్ - రొమాంటిక్ సీన్స్ - బూతు డైలాగ్స్ తో నిండిపోయింది. నలుగురు హీరోయిన్లు ఒకరికి మించి మరొకరు రెచ్చిపోయి రొమాన్స్ చేశారు. 'మురికి చేత అద్దము.. మావిచేత శిశువు యెట్లు కప్పబడునో.. అట్లు కామము చేత జ్ఞానము కప్పబడి యున్నది' అంటూ భగవద్గీతలో ప్రవచనం చెబుతూ.. శృంగార సన్నివేశాలను చూపించారు.

దీనిపై సోషల్ మీడియాలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ 'కమిట్ మెంట్' దర్శక నిర్మాతలపై మండిపడ్డారు. మరి రిలీజ్ సమయానికి ఇంకెన్ని వివాదాలు సృష్టిస్తుందో.. ఈ సినిమా తేజస్వికి ఎలాంటి పేరు తెచ్చిపెడుతుందో చూడాలి. ఫుట్ లూస్ ఎంటర్టైన్మెంట్స్ మరియు ఎఫ్3 ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై భల్ దేవ్ సింగ్ - నీలిమ ఈ చిత్రాన్ని నిర్మించారు.