Begin typing your search above and press return to search.

అరవిరిసిన తెలుగందం.. భలే అందాల ఆరవిందం!

By:  Tupaki Desk   |   8 May 2020 9:00 AM IST
అరవిరిసిన తెలుగందం.. భలే అందాల ఆరవిందం!
X
తెలుగుతెరపై అసలైన తెలుగు సొగసులను గుప్పించే పనిలో బిజీగా మారింది బిగ్ బాస్ బ్యూటీ తేజస్వి మదివాడ. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంతో టాలీవుడ్‌లో అరంగేట్రం చేసిన ఈ హైదరాబాదీ బ్యూటీ. రామ్ గోపాల్ వర్మ తీసిన ‘ఐస్ క్రీమ్’ చిత్రంతో మంచి గుర్తింపు సంపాదించింది. తెలుగులో ఇరవైకి పైగా చిన్నా చితకా చిత్రాల్లో నటించినా.. రామ్ గోపాల్ వర్మ ఐస్ క్రీమ్‌ సినిమానే ఇప్పటికి ఆమె కెరీర్ లో పాపులర్ ఫిల్మ్. ఇక ఆ సినిమా ఇచ్చిన పాపులారిటీతో బిగ్ బాస్ సీజన్ 2లో అవకాశం అందుకుంది. అక్కడ కూడా తనదైన శైలిలో వయ్యారాలు ఒలకబోస్తూ.. రచ్చ రచ్చ చేసి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. ఇక బిగ్ బాస్ లో కౌశల్ ఆర్మీతో ఎక్కువ ట్రోల్ కాబడిన కంటెస్టెంట్ గా కూడా పాపులర్ అయ్యింది. మరో కంటెస్టెంట్ సామ్రాట్‌తో లవ్ ట్రాక్ గేమ్ చివరి వరకూ లాక్కొచ్చి..

బయటకు వచ్చాక లవ్వూ లేదు గివ్వూ లేదు లైట్ తీస్కోండి బాస్.. అంటూ తనదైన శైలిలో ఎండ్ కార్డ్ వేసింది ఈ సుందరి. ఆ షో తరువాత సినిమా ఆఫర్లు అయితే రాలేదు కాని.. బ్రహ్మానందం తో కలిసి కామెడీ షోకి హోస్ట్‌గా చేసే అవకాశం వచ్చింది. వీరి హాస్యం అపహాస్యం కావడంతో ఆ షో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అయితే నటిగా తన ప్రయత్నాల్ని సోషల్ మీడియా వేదికగా వేగవంతం చేసింది. తనలోని లేత సొగసులకు పదును పెడుతూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో అందాల ఆరబోతకు తెర తీసింది. గ్లామర్ డోస్‌ని పెంచేసి క్లీవేజ్‌ షోతో ఓపెన్ అయ్యింది ముద్దుగుమ్మ. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్‌లో ఉన్న డిజైనర్ డ్రెస్‌లో ఒంపులన్నీ కనిపించేలా ఓపెన్ అయి కవ్వించే కళ్లతో మత్తెక్కిస్తుంది. చేతులకు ఫెంటాస్టిక్ బీస్ట్స్ బుక్.. చెవులకు హెవీ రింగ్స్ పెట్టి ఫొటోకి మరింత కిక్కిచ్చేలా పోజు పెట్టింది. సోషల్ మీడియాలో ఈ ఫోటోకి అందరూ ఫిదా అయి పోతున్నారు.