Begin typing your search above and press return to search.

బికినీ బీచ్ లో పిచ్చెక్కిస్తున్న తెలుగమ్మాయ్

By:  Tupaki Desk   |   9 May 2022 3:43 PM GMT
బికినీ బీచ్ లో పిచ్చెక్కిస్తున్న తెలుగమ్మాయ్
X
తేజ‌స్వి మాదివాడ ప‌రిచ‌యం అవ‌సరం లేదు. తెలుగమ్మాయిల్లో దూసుకుపోయే త‌త్వం ఉన్న ఈ అమ్మ‌డు ఇటీవ‌ల కొన్ని వ‌రుస‌ చిత్రాల్లో న‌టిస్తోంది. అయితే ఎందుక‌నో త‌న‌ను విజ‌యాలు వ‌రించ‌డం లేదు. ఇక బిగ్ బాస్ క్రేజ్ కూడా త‌న‌కు అంతంత మాత్ర‌మే క‌లిసొచ్చింది. బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొన్న రెండు సార్లు షో నుండి తొలగించబడింది. ఇప్పుడు తేజు త‌న ఫోటోషూట్ల నుంచి అరుదైన ఫోటోలు షేర్ చేస్తోంది.

తాజాగా షేర్ చేసిన ఫోటోలో తేజస్విని వెండి బికినీలో మెరిసిపోతోంది. బికినీ బీచ్ లో తెలుగ‌మ్మాయ్ ఒక రేంజులో చెల‌రేగింది. తేజు హాట్ గా కనిపిస్తూ బోల్డ్ రోల్స్ కు కూడా సిద్ధమని సంకేతాలు పంపింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో వైర‌ల్ గా మారింది. బిగ్ బాస్ సీజ‌న్ -2 త‌ర్వాత తేజ‌స్వి మాదివాడ సినీకెరీర్ ప‌రుగులు పెడుతుంద‌నే భావించారు. కానీ ఇక్క‌డ అంత సులువేమీ కాద‌ని అర్థ‌మైంది. బాబు బాగా బిజీ- బాల‌కృష్ణుడు లాంటి సినిమాల త‌ర్వాత వెబ్ సిరీస్ ల‌వైపు మ‌ళ్లింది. అప్ప‌ట్లో `మ‌న ముగ్గురి ల‌వ్ స్టోరి` అనే వెబ్ సిరీస్ లో న‌టించింది. అదే స‌మ‌యంలో బిగ్ బాస్ లో కంటెంస్టెంట్ గా ఛాన్స్ వ‌చ్చింది.

లీడ్ పాత్ర‌లు త‌న‌ని వ‌రిస్తున్నాయి. క‌మిట్ మెంట్ అనే ఇండ‌స్ట్రీ వేధింపులపై తీస్తున్న‌ సినిమాలో న‌టిస్తున్నా అది ఎంత‌వ‌ర‌కొచ్చింది అన్న‌ది క్లారిటీ రాలేదు. ఇంత‌లోనే కొవిడ్-19 ప్ర‌వేశంతో కెరీర్ ప‌రంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాల్లో స్పీడ్ గా ఉన్న ఈ బ్యూటీ ఇటీవ‌ల స‌డెన్ గా ఎందుక‌నో స్లో అవ్వ‌డంతో అనుమానం మ‌రింత బ‌ల‌ప‌డింది. మ‌రో ఆస‌క్తిక‌ర విష‌య‌మేమంటే.. తెలుగులో ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఛాన్సులిస్తున్నా తేజ‌స్వి కాద‌ని త‌ప్పించుకుని తిరుగుతోంద‌ని గుస‌గుస వినిపించింది. అదే క్ర‌మంలో బాలీవుడ్ ఎంట్రీ వ‌ల్ల‌నే ఇలా చేస్తోంద‌ని కూడా టాక్ వైర‌ల్ అయ్యింది.

మ‌హేష్‌ సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు సినిమాతో తేజ‌స్వీ తెరంగేట్రం చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత చాలా సినిమాల్లో స‌పోర్టింగ్ రోల్స్ చేసింది. ఈ క్ర‌మంలోనే రాంగోపాల్ వ‌ర్మ దృష్టిలో ప‌డింది. దీంతో వ‌ర్మ తేజ‌స్వీని లీడ్ రోల్ లో ఐస్ క్రీమ్ అనే ప్ర‌యోగం చేసారు. కానీ అది ఆశించిన ఫ‌లితాన్నివ్వ‌లేదు.