Begin typing your search above and press return to search.

వైరల్ అవుతున్న బిగ్ బాస్ బ్యూటీ.. టాటూ!

By:  Tupaki Desk   |   20 March 2021 7:30 AM GMT
వైరల్ అవుతున్న బిగ్ బాస్ బ్యూటీ.. టాటూ!
X
తెలుగమ్మాయి పునర్వవి భూపాలం.. అంటే ఇటు టీవీ ప్రేక్షకులతో పాటు అటు సినిమా ప్రేక్షకులకు కూడా పరిచయమే. ఎందుకంటే బిగ్ బాస్ 3 సీజన్ లో కంటెస్టెంటుగా పాల్గొని మంచి పాపులారిటీ సంపాదించుకుంది. పునర్నవికి సినిమాలు కూడా ఇవ్వలేని గుర్తింపు బిగ్ బాస్ రియాలిటీ షో ఇచ్చిందనే చెప్పాలి. ఆ మధ్యలో బాగా లావుగా కనిపించిన పునర్నవి లాక్డౌన్ నుండి తన సోయగాలకు మెరుగులు దిద్దేపనిలో పడింది. ప్రస్తుతం పునర్నవి చేతిలో సినిమా అవకాశాలేవీ లేవని తెలుస్తుంది. బిగ్ బాస్ లో ఎంతగా ఆకట్టుకుందో బయటికి రాగానే సినిమా అవకాశాలు అసలే రాలేదట. ఇక చేసేదేం లేక ఈ భామ.. సోషల్ మీడియాలో ఆకట్టుకునే ఫోటోలతో అభిమానులకు వినోదం పంచుతుంది.

తాజాగా పునర్నవి మరోసారి వార్తల్లో హాట్ టాపిక్ గా నిలిచింది. మరి అంతలా ఏం చేసిందంటే.. ఓ హాట్ ఫోటోతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా భూపాలం కోమలమైన వీపు సౌందర్యం చూపుతూ ఫోటోకు పోజిచ్చింది. కానీ ఆ ఫోటోలో వీపుతో పాటు ఓ టాటూ కూడా ఉంది. ఇప్పుడు అందరి దృష్టి ఆ టాటూ పైనే పడింది. నిజానికి పునర్నవి ఎప్పుడు సోషల్ మెరిసినా అందాలను కొసరికొసరి వడ్డించేస్తోంది. కామెంట్స్‌లో అయితే ఆమె అందచందాలను ఎవరికి నచ్చినట్టుగా వాళ్లు వర్ణించుకుంటూ వెళ్తుంటారు ఫ్యాన్స్. మోచేతి పై టాటూ చూస్తే ఏదో పుష్పంలా కనిపిస్తుంది. కానీ దాని వెనక కథేంటా అని అందరూ ఆలోచిస్తున్నారు. చూడాలి మరి త్వరలో ఆ టాటూ పై క్లారిటీ ఇస్తుందేమో! ఇదిలా ఉండగా.. పునర్నవి చివరిగా కమిట్మెంట్ అనే వెబ్ సిరీస్ లో కనిపించింది.