Begin typing your search above and press return to search.

రింగుల జుత్తు వాలు క‌ళ్ల‌తో బిగ్ బాస్ దివి స‌మ్మోహ‌నం

By:  Tupaki Desk   |   3 Jun 2021 1:36 PM GMT
రింగుల జుత్తు వాలు క‌ళ్ల‌తో బిగ్ బాస్ దివి స‌మ్మోహ‌నం
X
బిగ్ బాస్ ఫేం దివి వ‌ద్త్య‌ పేరు ఇటీవ‌ల టాలీవుడ్ లో ఓ రేంజులోనే మార్మోగుతోంది. దివి అంద‌చందాలు హాట్ కంటెంట్ పై ముచ్చ‌టించ‌ని యువ‌త‌రం లేనే లేదు. అంతగా పాపులారిటీ తెచ్చుకునేందుకు ఈ బ్యూటీ వేస్తున్న ఎత్తుగ‌డ ఆస‌క్తిక‌రం. నిరంత‌రం వేడెక్కించే ఫోటోషూట్ల‌తో ఇన్ స్టా వేదిక‌పై ద‌ర్శ‌న‌మిస్తోంది.

అలాగే ప‌రిశ్ర‌మ‌లో అందివ‌చ్చిన అవ‌కాశాల్ని అందిపుచ్చుకుని న‌టిగా ప్ర‌తిభ‌ను చూపించేందుకు త‌పిస్తోంది. దివి న‌టించిన క్యాబ్ స్టోరీస్ వెబ్ సిరీస్ యూత్ లోకి వైర‌ల్ గానే దూసుకెళ్లింది. ఇక ఈ సిరీస్ ఆద్యంతం దివి అంద‌చందాలు క‌వ్వింత అంద‌రికీ న‌చ్చేశాయి. త‌దుప‌రి ప‌లు టాలీవుడ్ చిత్రాల్లో అవ‌కాశాలు అందుకుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి

మెగా కాంపౌండ్ అక్కినేని కాంపౌండ్ నుంచి దివికి మునుముందు మంచి అవ‌కాశాలు ద‌క్క‌నున్నాయ‌ని స‌మాచారం. ఇంత‌లోనే టైమ్స్ మోస్ట్ డిజైర‌బుల్ ఉమెన్ 2020 జాబితాలో దివి అగ్ర ప‌థాన నిలిచి మ‌రోసారి అటెన్ష‌న్ ని త‌న‌వైపు తిప్పేసుకుంది. దివి అంద‌చందాలు వైర‌ల్ ప్ర‌మోష‌న్ యువ‌త‌రానికి న‌చ్చేయ‌డంతో మోస్ట్ డిజైర‌బుల్ జాబితాలో చేర్చేశారు. మ‌రోవైపు దివి వ‌ద్య‌త లేటెస్ట్ ఫోటోషూట్ అంత‌ర్జాలంలో సునామీ సృష్టిస్తోంది. ఆ రింగుల జుత్తు.. వాలు క‌ళ్ల‌తో బిగ్ బాస్ దివి స‌మ్మోహ‌నం లోకి దించేస్తోంది అంటూ అభిమానులు వ్యాఖ్య‌ల్ని జోడిస్తున్నారు. ఇక ఇదే స్పీడ్ లో త‌దుప‌రి దివి త‌న‌ పెద్ద ప్రాజెక్ట్ కి సంబంధించిన అప్ డేట్ చెబుతుందేమో చూడాలి.