Begin typing your search above and press return to search.

ఈ అమ్మడికి బిబి తో బాగానే కలిసొచ్చింది

By:  Tupaki Desk   |   17 Dec 2020 1:30 PM IST
ఈ అమ్మడికి బిబి తో బాగానే కలిసొచ్చింది
X
తెలుగు బిగ్‌ బాస్‌ గత మూడు సీజన్‌ ల్లో కంటెస్టెంట్స్‌ గా పాల్గొన్న సెలబ్రెటీల్లో ఏ ఒక్కరికి కూడా స్టార్‌ డం అయితే రాలేదు. ఒక్కరు ఇద్దరు కెరీర్ లో పర్వాలేదు అనిపించుకుంటూ ఉండగా మరి కొందరు మాత్రం బిగ్ బాస్ తర్వాత మరింతగా డల్‌ అయ్యారు. బిగ్‌ బాస్‌ సీజన్‌ 3 విన్నర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ ఒక్కడే బిబి క్రేజ్ తో బాగా పాపులారిటీని దక్కించుకోవడంతో పాటు కొత్త ఆఫర్లు పొందాడు. ఇక ఈ సీజన్‌ లో కంటెస్టెంట్ అయిన దివి హీరోయిన్‌ అవ్వాలనే కోరిక తీరుతుంది. బిగ్‌ బాస్ తో ఈ అమ్మడికి బాగానే పాపులారిటీ మరియు ఫేమ్‌ దక్కింది. అందుకే ఈమెను వెబ్‌ సిరీస్‌ ల్లో మరియు సినిమాల్లోకి తీసుకునేందుకు పలువురు ముందుకు వచ్చారట.

ఇటీవల దివి సోషల్‌ మీడియా ఫొటో షూట్‌ లు రచ్చ రచ్చగా ఉన్నాయి. ఆమె ఫొటో షూట్స్‌ తో ఉత్తరాది ముద్దుగుమ్మలను కూడా మైమరపిస్తుంది. సొట్టబుగ్గల ఈ సుందరికి పలువురు ఫిల్మ్‌ మేకర్స్ ఆఫర్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. అయితే వచ్చే ప్రతి ఒక్క ఆఫర్‌ ను ఒప్పుకోకుండా ఇప్పటి వరకు ఈమె రెండు సినిమాలను కమిట్‌ అయ్యిందట. త్వరలోనే ఆ సినిమాల వివరాలను నిర్మాతుల వెళ్లడించబోతున్నట్లుగా స్వయంగా దివి పేర్కొంది. వాటి తర్వాత దివికి మరింత పాపులారిటీ దక్కి తెలుగులో వరుసగా సినిమాలు చేస్తుందేమో చూడాలి.