Begin typing your search above and press return to search.

జోరు త‌గ్గ‌ని బిగ్ బాస్ బ్యూటీ.. నాగార్జున‌తో క్లోజ్ సెల్ఫీ..!

By:  Tupaki Desk   |   16 March 2021 2:18 PM GMT
జోరు త‌గ్గ‌ని బిగ్ బాస్ బ్యూటీ.. నాగార్జున‌తో క్లోజ్ సెల్ఫీ..!
X
ఏ నిమిషంలో.. ఏం జ‌రుగుతుందో ఎవ్వ‌రూ ఊహించ‌లేరు అనే మాట‌కు అస‌లైన ఉదాహ‌ర‌ణ అరియానా గ్లోరీ. కేవ‌లం ఒక ఇంట‌ర్వ్యూ ఆమె జీవితాన్నే మార్చేసిందంటే అతిశ‌యోక్తి కాదు. అరియానా గ‌తంలో ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌ను ఇంట‌ర్వ్యూ చేసింది. ఈ సంద‌ర్భంగా అడిగిన ఒక ప్ర‌వ్న ఆమె జీవితాన్నే మ‌లుపు తిప్పింది!

ఆ సంద‌ర్భంగా.. 'మీకు ఏ అమ్మాయిని చూస్తే.. వావ్‌! అనిపిస్తుంది' అని అరియానా ప్రశ్నించగా.. 'నిన్నే' అని సమాధానం ఇచ్చాడు ఆర్జీవీ. అంతటితో ఆగకుండా.. 'నిన్ను బికినీలో చూడాలని ఉంది' అని ఓపెన్ గా చెప్పేశాడు. దీంతో.. అరియానా పేరు ఒక్క‌సారిగా మారుమోగిపోయింది. ఈ ఫేమ్ ఆమెను బిగ్ బాస్ షో దాకా తీసుకెళ్లిందంటే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు.

ఇక‌, బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగు పెట్టిన త‌ర్వాత అక్క‌డ అరియానా చేసిన హంగామా మామూలుగా లేదు. త‌న‌దైన మాట‌తీరుతో అంద‌రినీ ఆక‌ర్షించింది. ముక్కుసూటిత‌నంతో ఆమె ఆడిన ఆట ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. దీంతో.. ఫైన‌ల్ రేసు వ‌ర‌కూ దూసుకెళ్లిన అరియానా.. నాలుగో స్థానంతో స‌రిపెట్టుకొంది. ఆ త‌ర్వాత నుంచి నిత్యం వార్త‌ల్లో నిలుస్తూ పాపులారిటీ పెంచేసుకుంటోంది.

ఇక, సినిమా అవ‌కాశాల‌ను కూడా అందిపుచ్చుకుంటోంది. ఇప్ప‌టికే రాజ్ త‌రుణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన అరియానా.. మెగా హీరో క‌ల్యాణ్ దేవ్ మూవీలోనూ ఆఫ‌ర్ ద‌క్కించుకుంది. కాగా.. హీరో నాగార్జున లేటెస్ట్ మూవీ 'వైల్డ్ డాగ్‌' ఏప్రిల్ 2న రిలీజ్ కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో నాగ్ ను ఇంట‌ర్వ్యూ చేసింది అరియానా. ఈ సంద‌ర్భంగా మ‌రోసారి నాగ్ స‌ర్ ను క‌లిశానంటూ సోష‌ల్ మీడియాలో పిక్ పోస్ట్ చేసింది. ఈ పిక్ వైరల్ గా మారింది.