Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ : బిగ్ బాస్ బ్యూటీ బార్బీ డాల్ గా మారిందా..!

By:  Tupaki Desk   |   30 Oct 2022 2:30 AM GMT
ఫోటో స్టోరీ : బిగ్ బాస్ బ్యూటీ బార్బీ డాల్ గా మారిందా..!
X
బిగ్ బాస్ వల్ల భారీగా క్రేజ్ తెచ్చుకున్న వారిలో అషు రెడ్డి ఒకరు. అంతకుముందు కేవలం టిక్ టాక్ ద్వారానే పాపులర్ అయిన ఆమె బిగ్ బాస్ తర్వాత మాత్రం ఓ రేంజ్ లో ఫేమస్ అయ్యింది. అందులోనూ ఓ స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఆమె అందాల ప్రదర్శన మరింత మైలేజ్ వచ్చేలా చేసింది.

గ్లామర్ షోలో నో లిమిట్స్ అనేలా తన పంథా కొనసాగిస్తుంది అషు. రోజుకొక కొత్త ఫోటో షూట్ తో ఫాలోవర్స్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇవాళ ఇక్కడ ఉన్న అమ్మడు నెక్స్ట్ డే ఏ ఫారిన్ లొకేషన్ లోనో కనిపిస్తుంది. ప్రస్తుతం అషు రెడ్డి మాయలో ఆమె ఫాలోవర్స్ ఉన్నారని చెప్పొచ్చు.

ఇక లేటెస్ట్ గా అమ్మడు మరోసారి రెచ్చిపోయింది. పారిస్ లో ప్రత్యక్షమైన అషు రెడ్డి వెనక ఈఫిల్ టవర్ కనిపించేలా ఫోటోలకు ఫోజులిచ్చింది. అయితే వెనక ఉంది ఎంత గొప్ప ఈఫిల్ టవర్ అయినా అషు రెడ్డి అందాల ముందు చిన్నబోయింది.

ఆమె జిగేలుమనిపించే అందాల మెరుపుల్లో కుర్రాళ్లంతా గిలగిల తన్నుకుంటున్నారు. అక్కడ ఉంది అషు రెడ్డినా లేక బార్బీ బొమ్మా అనిపించేలా మ్యాజిక్ చేస్తుంది. అంతేకాదు ప్రైవేట్ పార్ట్ లోని ట్యాటూలని ఎక్స్ పోజ్ చేస్తూ కుర్రాళ్ల గుండెల్లో మంటలు రేపుతుంది అమ్మడు.

గ్లామర్ షో విషయంలో తన ఫాలోవర్స్ ని ఏమాత్రం నిరుత్సాహపరచని అషు రెడ్డి రోజు రోజుకి శృతిమించిపోతుందని చెప్పొచ్చు. మరి అమ్మడు ఈ కష్టమంతా కేవలం క్రేజ్ కోసమేనా లేక అవకాశాల కోసమా అన్నది తెలియాల్సి ఉంది. లేటెస్ట్ గా అషు రెడ్డి నటించిన ఫోకస్ సినిమా రిలీజైంది. ఆ సినిమా మీద అంత ఫోకస్ చేయలేదు అషు రెడ్డి. మూవీలో అషు పోలీస్ పాత్రలో మెరిసింది.

అలా ఇలా కాదు అషుకి ఉన్న సోషల్ మీడియా ఫాలోయింగ్ కి ఉప్పెన లాంటి ఓ క్రేజీ సినిమా చేయొచ్చని అంటున్నారు ఆమె ఫాలోవర్స్. సినిమా ఛాన్సులు వచ్చినా రాకపోయినా అషు మాత్రం తన అందాలతో ఆడియన్స్ ని డిస్ట్రబ్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యింది. అందుకే ఒకదానికి మించి మరొక ఫోటో షూట్ చేస్తూ సత్తా చాటుతుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.