Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 6 : ఈ సీజన్ ప్లస్సు.. మైనస్సు.. అతనే..!

By:  Tupaki Desk   |   5 Nov 2022 6:28 AM GMT
బిగ్ బాస్ 6 : ఈ సీజన్ ప్లస్సు.. మైనస్సు.. అతనే..!
X
ఎన్నో భారీ అంచనాలతో మొదలైన బిగ్ బాస్ సీజన్ 6 21 మంది హౌస్ మెట్స్ తో హంగు ఆర్భాటాలతో మొదలైనా సరే పేలవమైన టీ.ఆర్.పి రేటింగ్ తో కొనసాగుతుంది. ఈ సీజన్ లో తీసుకోడానికి 21 మందిని తీసుకున్నా సరే ఒక్కరు కూడా పర్ఫెక్ట్ గేమ్ ఆడుతున్న వారు లేరని చెప్పొచ్చు. ఎలాగోలా 9 వారాలు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ సీజన్ 6 10వ వారం కూడా ఈరోజుతో పూర్తి చేసుకుంటుంది. వీక్ డేస్ లో హౌస్ మెట్స్ ఎంత ఆడియన్స్ కి బోర్ కొట్టించినా వీకెండ్ లో నాగార్జున మాత్రం షోని నిలబెట్టాలని మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 3 నుంచి వరుసగా 3 వ సీజన్ హోస్ట్ చేస్తున్న నాగార్జున ఈ సీజన్ లో హోస్ట్ గా మరింత జోష్ కనబరుస్తున్నారు.

ఇక ప్రస్తుతం హౌస్ లో 13 మంది కంటెస్టంట్స్ ఉన్నారు. వారిలో ఇప్పటివరకు ఎవరిలో టైటిల్ విన్నర్ గా అయ్యే క్వాలిటీస్ కనిపించలేదు. ఉన్న వాళ్లలో చూస్తే సింగర్ రేవంత్ ఎలాగు బయట ఎగ్జిస్టింగ్ ఇమేజ్ ఉంది కాబట్టి అతనే విన్నర్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. అయితే రేవంత్ వల్లే బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెంట్ వస్తుంది.

తన ఆట తీరు మాత్రమే కాదు మాట తీరు కూడా బిగ్ బాస్ షోని నిలబెట్టేలా చేస్తుంది. అదెలా అంటే రేవంత్ ఆటలో ఉన్మాదిలా ఆడుతున్నాడని నాగార్జున ఆల్రెడీ చెప్పాడు. వీడియో చూపించి మరి అతన్ని వార్న్ చేశాడు. అయినా సరే అతని ఆట తీరు ఏమాత్రం మారలా.. ఇక రేవంత్ మాట తీరు కూడా కోపం వస్తే నీ..మ్మ.. నీ.. బ్బా.. అంటూ ఇంకా చాలా భూతులే వదులుతున్నాడు.

నిజానికి బిగ్ బాస్ కి ఇలాంటి కంటెంటే కావాలి.. అంతా సాఫీగా జరిగితే బిగ్ బాస్ కి కిక్ ఉండదు. అందుకే రేవంత్ వల్లే కాస్త కూస్తో ఈ మాత్రం రేటింగ్ అయినా వస్తుందని చెప్పొచ్చు. అయితే అదే రేవంత్ వల్ల షో అట్మాస్పియర్ కూడా డిస్ట్రబ్ అవుతుంది. అతని ఆట తీరు బాగున్నా అతని ఎటాకింగ్.. మాట్లాడే విధానం రేవంత్ కి చాలా మైనస్ అవుతున్నాయి. ప్రస్తుతానికి టైటిల్ రేసులో రేవంత్ మాత్రమే ఉన్నాడు. కెప్టెన్ అయిన వీక్ తప్ప రేవంత్ గడిచిన 10 వారాల్లో 9 సార్లు నామినేట్ అవుతూ వస్తున్నాడు. సో దానివల్ల రేవంత్ కి ఓటు వేసే ఆడియన్స్ సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది.

బిగ్ బాస్ సీజన్ 6 కి అతనే ప్లస్సు.. అతనే మైనస్సు.. అందుకే రేవంత్ మీదే ఎక్కువ కంటెంట్ ఇస్తున్నారు బిగ్ బాస్ టీం. అయితే అతను ఎంత గొడవ పడినా సరే హౌస్ లో ఎవరికి ఏదైనా అయినా.. ఎవరైనా ఎమోషనల్ గా డిస్ట్రబ్ అయిన సరే రేవంత్ ముందుకొచ్చి వారిని ఓదార్చుతూ కనిపించాడు.

సో అతని ఆట తీరు, మాట తీరు ఎలా ఉన్నా ఈ ఒక్క క్వాలిటీ అతన్ని విన్నర్ ని చేస్తుందని రేవంత్ ఫ్యాన్స్ అంటున్నారు. రేవంత్ కాకుండా విన్నర్ అయ్యే వారు ఎవరు అంటే దానికి ఆన్సర్ కూడా దొరకని పరిస్థితి కనబడుతుంది. ఆడటానికి గీతు.. ఆది రెడ్డి.. శ్రీహాన్.. ఫైమా లాంటి వారు ఆట బాగానే ఆడుతున్నా బయట మాత్రం ఓటింగ్ లో నెంబర్ 1 గా ఉంటూ వస్తున్నాడు రేవంత్. అందుకే అతనికే ఈసారి టైటిల్ దక్కే ఛాన్స్ ఉందని టాక్.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.