Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 6 డే 4 : కెప్టెన్సీ పోరు.. భార్యాభర్తల గొడవ

By:  Tupaki Desk   |   9 Sep 2022 7:33 AM GMT
బిగ్ బాస్ 6 డే 4 : కెప్టెన్సీ పోరు.. భార్యాభర్తల గొడవ
X
ఈసారి బిగ్ బాస్ మొదటి వారంలోనే గొడవలు రసవత్తరంగా సాగుతున్నాయి. నామినేషన్స్‌ లో ఎంపిక అయిన వారిలో నుండి ఇద్దరిని ఎలిమినేట్‌ చేసే అవకాశాలు ఉన్నాయంటూ బిగ్ బాస్ నుండి ప్రకటన రావడంతో కంటెస్టెంట్స్ కిందా మీద పడుతున్నారు. మొదటి వారంలోనే డబుల్‌ ఎలిమినేషన్‌ షాక్ ఇస్తారా అనే విషయం పక్కన పెడితే ప్రస్తుతం నామినేషన్‌ లో ఉన్న వారు చుక్కలు చూస్తున్నారు. ప్రస్తుతం వారితో పాటు ఇతరులు కూడా ఫైనల్‌ కి బిగ్ బాస్ చేరిందా అన్నట్లుగా అగ్రెసివ్ గా ఉంటున్నారు.

మొదటి వారం తర్వాత కెప్టెన్సీ టాస్క్ లో రచ రచ్చ గా వాదోపవాదాలు సాగుతున్నాయి. కెప్టెన్‌ ఎంపిక కోసం డిస్కషన్‌ ప్రారంభం అయిన సమయంలో ఒకొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తూ ఒకరిమీద ఒకరు కారాలు మిరియాలు నూరుకున్నారు. ఆ సమయంలో గీతూ రాయల్‌ మరియు రేవంత్ మధ్య గొడవ అయ్యింది. నువ్వు పో అంటే నువ్వు పో అన్నట్లుగా ఇద్దరు వాదులాడుకున్నారు. ఆ తర్వాత ఒకొక్కరు చొప్పున కెప్టెన్‌ గా ఎవరికి అర్హత ఉందనే విషయంలో పేర్లు చెప్పారు.

కెప్టెన్సీ రేసులో ఆర్జే సూర్య.. మెరీనా-రోహిత్‌.. బాలాదిత్య లను మాస్ టీమ్ ఎంపిక చేయడం జరిగింది. ఒక వైపు కెప్టెన్సీ రచ్చ జరుగుతున్న సమయంలో మరో వైపు భార్య భర్తలుగా ఎంట్రీ ఇచ్చిన మెరీనా మరియు రోహిత్‌ ల మధ్య గిల్లి కజ్జాలు పీక్స్‌ కి చేరాయి.

ఇద్దరు పదే పదే గొడవ పడుతూ కంటెస్టెంట్స్ కి మాత్రమే కాకుండా ప్రేక్షకులకు కూడా చిరాకు పెడుతున్నారు. ఇద్దరు పదే పదే చిన్న విషయంలో కూడా గొడవ పడుతున్నారు.

తాజా ఎపిసోడ్‌ లో మెరీనా తన భర్త రోహిత్ తనతో వాకింగ్‌ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ సమయం లోనే అతడు శ్రీ సత్య తో ఉంటున్నాడు అంటూ కామెంట్స్ చేసింది. నా భర్త నీతో ఉన్నాడంటూ కాస్త హడావిడి చేసి.. గొడవ చేసి రచ్చ చేసి చివరకు ఫ్రాంక్ అంటూ మెరీనా అన్నా కూడా అక్కడి వారు అంతా కూడా ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదెక్కడి ఫ్రాంక్‌ బాబోయ్ అంటూ ప్రేక్షకులు కూడా అసహనం వ్యక్తం చేశారు.

మొత్తానికి నాల్గవ రోజే బిగ్‌ బాస్ లో హడావుడి మామూలుగా లేదు. ఇంటి నిండా జనాలు ఉన్నారు. అందులో కొందరు కెమెరాకు కనిపించాలని హడావుడి చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం తమ పనేదో తాము చేసుకుంటూ పోతున్నారు. కాస్త హైప్‌ తోనే నిన్నటి ఎపిసోడ్‌ ముగిసింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.