Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 6 : 70 రోజుల ఆట ముగిసింది.. ఈ టాప్ టెన్ లో ఆ ఐదుగురు ఎవరు..?

By:  Tupaki Desk   |   14 Nov 2022 4:40 AM GMT
బిగ్ బాస్ 6 : 70 రోజుల ఆట ముగిసింది.. ఈ టాప్ టెన్ లో ఆ ఐదుగురు ఎవరు..?
X
ఇండియాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 6 లో హౌస్ మెట్స్ 70 రోజుల ప్రయాణం ముగిసింది. సెప్టెంబర్ 4న 21మంది హౌస్ మెట్స్ తో ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 6 మొదట్లో ఆడియన్స్ ని అలరించడంలో తడబడ్డా వారాలు గడుస్తున్నా కొద్దీ షో మీద ఆసక్తి కలిగేలా చేశారు. 10 వారాల తర్వాత 11 మంది హౌస్ మెట్స్ ఎలిమినేట్ అవగా 10 మంది మాత్రమే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నారు. ఈ 10 మందిలో టాప్ 5 ఎవరు.. టాప్ 3 ఎవరు.. ఫైనల్ గా టైటిల్ విన్నర్ ఎవరన్నది తెలియాల్సి ఉంది.

ఈ సీజన్ లో స్ట్రాంగ్ కంటెస్టంట్స్ చాలా తక్కువమంది ఉన్నారని చెప్పొచ్చు. బాగా ఆడతారు అనుకున్న వారు నిరాశపరిచారు.. ఓ మోస్తారుగా ఆడతారు అనుకున్న వారు తమ ఆటతో మెప్పిస్తున్నారు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇమేజ్ తో కొంతమంది తమ ఆట కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో రేవంత్, శ్రీహాన్, ఆది రెడ్డి, రోహిత్, మెరినా, ఇనయా, శ్రీ సత్య, రాజ్, ఫైమా, కీర్తి శెట్టిలు ఉన్నారు. వీరిలో టాప్ 5కి ఎవరు వెళ్తారు అన్నది మరో ఐదు వారాల్లో తెలుస్తుంది.

ఇండియన్ ఐడల్ సింగర్ గా రేవంత్ అందరికి సుపరిచితుడే.. 10 వారాలుగా ఎక్కువ నామినేషన్స్ లో ఉన్నది అతనే. ఓటింగ్ పర్సెంటేజ్ కూడా అందరికన్నా అతనికే ఎక్కువ ఉంది. సో టాప్ 5 కాదు రేవంత్ టైటిల్ రేసులో ముందున్నాడు అని చెప్పొచ్చు.

సిరి బోయ్ ఫ్రెండ్ శ్రీహాన్ కూడా సీజన్ 5లో జస్ట్ ఒక ఎపిసోడ్ కి అలా వచ్చి పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత అతను చేసిన షార్ట్ ఫిలింస్ కూడా ప్రేక్షకులకు రీచ్ అయ్యాయి. ప్రస్తుతం హౌస్ లో ఉన్న 10 మందిలో టాప్ 5కి పక్కా అనుకునే వారిలో శ్రీహాన్ కూడా ఒకరు.

కామన్ మ్యాన్.. రివ్యూయర్ ఆది రెడ్డి కూడా అనకు వచ్చిన బిగ్ బాస్ ఛాన్స్ ని సూపర్ గా వాడుకుంటున్నాడు. తన సెటిల్డ్ పర్ఫార్మెన్స్.. మాట తీరుతో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తున్నాడు. ఎలాగు అతనికి ఉన్న సోషల్ మీడియా ఫాలోయింగ్ కి అతను టాప్ 5 పక్కా అని ఫిక్స్ అవ్వొచ్చు. ఆట కూడా బాగుంది కాబట్టి అతను టాప్ 5 ఉండే ఛాన్స్ పక్కా ఉంది.

ఇక మిగిలిన వారిలో ఇనయా, ఫైమా కూడా తమ ఆట తీరు.. మాట తీరుతో బిగ్ బాస్ కి సూపర్ కంటెంట్ ఇస్తున్నారు. వీరిద్దరు కూడా టాప్ 5 లో ఉండే ఛాన్స్ ఉంది. శ్రీ సత్య, రోహిత్, మెరినా, రాజ్, కీర్తి వీరిలో కూడా ఒకరికి టాప్ 5 ఛాన్స్ ఉంది. టాప్ 10 ఓకే.. ఇంతకీ టాప్ 5 ఎవరు.. రానున్న వార్తాల్లో ఎవరు మరింత స్ట్రాంగ్ అవుతారు.. ఎవరు వీక్ అయ్యి ఎలిమినేట్ అవుతారు అన్నది చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.