Begin typing your search above and press return to search.

బిగ్ బాస్‌ 5 : మొదటి వారం ఎలిమినేషన్ నామినేషన్స్‌ లో వీరు

By:  Tupaki Desk   |   7 Sep 2021 3:15 AM GMT
బిగ్ బాస్‌ 5 : మొదటి వారం ఎలిమినేషన్ నామినేషన్స్‌ లో వీరు
X
తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 సోమవారం ఎపిసోడ్‌ ఎప్పటిలాగే ఆసక్తిగా సాగింది. ఆదివారం ఎపిసోడ్‌ లో హౌస్‌ మెట్స్ పరిచయం అయ్యింది. ఒకరికి ఒకరు ఇంకా పూర్తిగా పరిచయం అవ్వకుండానే అప్పుడే సోమవారం ఎపిసోడ్‌ లో ఎలిమినేషన్ కు నామినేషన్ పక్రియ జరిగింది. మొదటి రోజు ఎపిసోడ్‌ లోనే ఏడుపులు అరుపులు గొడవలు జరిగాయి. మొత్తానికి బిగ్ బాస్ ఎలిమినేషన్‌ పక్రియ మొదలు అయ్యిందంటే ఉండే డ్రామా చాలా సహజంగానే తాజా ఎపిసోడ్‌ లో జరిగింది. సోమవారం ఎపిసోడ్‌ లో జరిగిన ఎలిమినేషన్‌ నామినేషన్‌ పక్రియలో అప్పుడే చిన్న చిన్న అపార్థాలు గొడవలు ఇంటి సభ్యుల మద్య ఉన్నట్లుగా వెళ్లడి అయ్యింది. బిగ్‌ బాస్ నామినేషన్‌ పక్రియలో భాగంగా ఒకొక్కరు వచ్చి ఇద్దరి ఫొటో ఉన్న చెత్త బ్యాగ్‌ ను డస్ట్‌ బిన్ లో వేయాల్సి ఉంటుంది. అలా బిగ్ బాస్ ఎలిమినేషన్‌ పక్రియ సాగింది.

అంతకు ముందు ఎపిసోడ్‌ ప్రారంభం అయిన వెంటనే లోబో గురక సౌండ్‌ తో ఇంటి సభ్యులు ఇబ్బంది పడటం.. ఆ తర్వాత సిరి మరియు జస్సీలు ఇంటి సభ్యుల వస్తువులు దాచి పెట్టడం జరిగింది. అదే సమయంలో హమీదా తన పెంపుడు పిల్లి గురించి చెబుతూ మా అంటూ అరుస్తాయని అనగా ఆ సమయంలో కుక్కలు డాడీ అంటాయా అంటూ జెస్సీ కాస్త సరదాగా ఆట పట్టించాడు. అది కాస్త సీరియస్ అయ్యింది. ఆ సంఘటన కారణంగానే అతడిని పలువురు నామినేషన్‌ చేసే వరకు వెళ్లింది. ఈ మొత్తం వ్యవహారంలో జెస్సీది తప్పు అన్నట్లుగా పలువురు ఆయన్ను టార్గెట్ చేసినట్లుగా మాట్లాడారు. దాంతో నామినేషన్ సమయంలో జెస్సీ కన్నీళ్లు కూడా పెట్టుకోవడం జరిగింది.

బిగ్‌ బాస్‌ సీజన్‌ 5 లో మొదటి వారం ఎలిమినేషన్‌ లో ఎవరు ఏ ఇద్దరిని నామినేషన్‌ చేశారంటే...

శ్రీరామ్.. మానస్, జెస్సీ‌
సరయు.. కాజల్, రవి
శ్వేత.. హమిద, నటరాజ్‌
విశ్వ.. (జెస్సీ), మానస్‌
ఆనీ మాస్టర్.. సిరి, జెస్సీ
జెస్సీ .. విశ్వ, హమీదా
యాంకర్ రవి.. నటరాజ్, మానస్‌
ఉమాదేవి.. కాజల్, జశ్వంత్‌
హమీదా.. లహరి, జెస్సీ
షణ్ముక్ జస్వంత్.. సన్నీ, లోబో
సన్నీ.. షణ్ముక్, సరయు
ప్రియాంక.. షణ్ముఖ్, హమీద
నటరాజ్.. రవి, జెస్సీ
ప్రియ.. సిరి, కాజల్‌‌
లోబో.. ప్రియ, యాంకర్ రవి
మానస్.. విశ్వ, సరయు
సిరి.. హమీదా, ప్రియ
కాజల్.. సరయు, ఉమ
లహరి.. హమిదా, కాజల్‌