Begin typing your search above and press return to search.
బిబి4 : సమంతతో సాగదీసినట్లుగా అనిపించింది
By: Tupaki Desk | 26 Oct 2020 9:31 AM ISTతెలుగు బిగ్ బాస్ ఈ వీకెండ్ కు నాగార్జున అందుబాటులో ఉండడు గెస్ట్ హోస్ట్ అంటూ చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. అన్నట్లుగానే నిన్నటి ఎపిసోడ్ కు గెస్ట్ హోస్ట్ వచ్చింది. తాను వైల్డ్ డాగ్ షూటింగ్ కు వెళ్లవల్సి రావడంతో నాగార్జున తన బిగ్ బాస్ ఇంటి బాధ్యతను కోడలు పిల్ల సమంతకు అప్పగించాడు. సమంత హోస్టింగ్ ఎలా చేసినా కూడా ఖచ్చితంగా షో పై ప్రేక్షకుల్లో ఆసక్తి కలుగుతుందని నిర్వాహకులు భావించారు. అనుకున్నట్లుగానే షో కు సమంత గెస్ట్ హోస్ట్ అనగానే అందరిలో ఆసక్తి కనిపించింది. ప్రేక్షకులు టీవీలకు అతుక్కు పోయారు. సమంత బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఓ సరదా ముచ్చట్లు వారిపై పంచ్ లు వారితో గేమ్స్ తో షో మొత్తం సందడిగా సాగింది.
దసరా పండుగ స్పెషల్ అవ్వడం వల్ల సాయంత్రం ఆరు గంటల నుండి ఏకంగా 9 గంటల వరకు సాగింది. అంటే మూడు గంటల పాటు షో సాగింది. పండుగ స్పెషల్ కార్యక్రమాలు ఇలా మూడు గంటలు ఉండటం కామన్ గా జరుగుతుంది. కాని బిగ్ బాస్ ను మూడు గంటలు ప్రేక్షకులు చూడటానికి కాస్త ఇబ్బంది పడ్డట్లుగా అనిపించింది. సమంత హోస్టింగ్ అయినా రెగ్యులర్ గా ఉన్నట్లుగానే దసరా స్పెషల్ ఎపిసోడ్ కూడా గంటన్నర పాటు ఉంటే బాగుండేది అనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది. సమంతతో షో ను సాగ తీసినట్లుగా అనిపించింది.. ఒక్కో చోట బోరింగ్ గా కూడా అనిపించింది. మద్య మద్యలో డాన్స్ మరియు పాటల ఫెర్ఫార్మెన్స్ లు జొప్పించారు.
మొత్తానికి నిన్నటి ఎపిసోడ్ లో కాస్త సందడి చేసింది హైపర్ ఆది కొన్ని పంచ్ లు మరియు సమంత క్యూట్ హోస్టింగ్. అంతకు మించి ఇంటి సభ్యుల ఆటలు మరియు ఇతరం ఏమీ కూడా అంతగా ఆకట్టుకోలేక పోయాయి. నాగార్జున మాదిరిగానే ఎక్కువగా ఫోకస్ మోనాల్ మరియు అవినాష్ లపైనే సమంత కూడా చేసినట్లుగా అనిపిస్తుంది. ఆమెది మాత్రం ఏముంది లేండి ఆమెకు ప్రామ్టింగ్ ఇచ్చిన వారు స్క్రిప్ట్ చేసిన వారు అలా కంటిన్యూ చేస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో ఇంటి సభ్యులకు వారి ఇంటి సభ్యులను 50 రోజుల తర్వాత చూపించారు. దాంతో వారి ఆనందంకు అవధులు లేకుండా పోయాయి.
ప్రతి ఒక్కరు కూడా ఎమోషనల్ అయ్యారు. మొత్తానికి నిన్నటి ఎపిసోడ్ ఒక మోస్తరుగా పర్వాలేదు అనిపించింది. స్వీట్ అండ్ షార్ట్ గా సమంత వచ్చి వెళ్లి ఉంటే మరింత బాగుండేది. వచ్చే వారం కూడా సమంత హోస్టింగ్ చేసే అవకాశం ఉంది. వచ్చే వారం ఆమె స్వీట్ అండ్ షార్ట్ గానే గంటన్నర పాటు వచ్చి వెళ్లే అవకాశం ఉంది. దాంతో వచ్చే వారం తప్పకుండా షో మరింత ఆకట్టుకునే అవకాశం ఉంది.