Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ ఇంట్లో న‌లుగురు హీరోలు ఎవ‌రు?

By:  Tupaki Desk   |   17 July 2020 6:30 AM GMT
బిగ్ బాస్ ఇంట్లో న‌లుగురు హీరోలు ఎవ‌రు?
X
`బిగ్ బాస్ - తెలుగు` కొత్త సీజ‌న్ కి స‌మ‌య‌మాస‌న్న‌మైంది. ప్ర‌తి సీజ‌న్ లోనూ టాలీవుడ్ నుంచి ఎవ‌రో ఒకరిద్ద‌రు హీరోలు ఉంటూనే ఉన్నారు. శివ‌బాలాజీ.. న‌వ‌దీప్.. కౌశిక్.. వ‌రుణ్ సందేశ్ .. త‌నీష్.. ప్రిన్స్ ఇలా యువ‌హీరోలంతా బిగ్ బాస్ కంటెస్టెంట్లే. వీళ్లంతా ఎవ‌రికి వారు ప్ర‌త్యేక‌త నిలుపుకున్నారు. ఇందులో కౌశిక్ మిన‌హా ఎవ‌రూ విజేత లేరు కానీ ఇంటి ఆవ‌ర‌ణ‌లో త‌మ‌దైన శైలి విన్యాసాల‌తో అభిమానుల్ని పెంచుకోగ‌లిగారు.

ఓవైపు అందాల క‌థానాయిక‌లు .. టీవీ తార‌లు.. టిక్ టాక్ స్టార్లు.. ఉన్నా.. అంద‌రిలోనూ హీరోలు త‌మ ప్ర‌త్యేక‌త‌ను నిలుపుకునేందుకు చాలానే ప్ర‌య‌త్నించారు. ఇక‌పోతే బిగ్ బాస్ సీజ‌న్ 4 కి స‌మ‌యం ఆస‌న్న‌మైంది. మ‌హ‌మ్మారీ వల్ల ఆల‌స్య‌మ‌వుతున్నా.. ఇప్ప‌టికే సెలెక్ష‌న్ ప్రాసెస్ వేగం పుంజుకుందిట‌. మొత్తం 40మంది వందరోజుల పాటు ఇంట్లో ఉండి సంద‌డి చేయాలి. ఈసారి ఇందులో న‌లుగురు హీరోలు క‌నిపించే వీలుంద‌న్న వార్త ఆస‌క్తిని పెంచుతోంది.

ఇప్ప‌టికే జాబితాలో ఆ న‌లుగురు హాట్ టాపిక్ గా మారారు. వీళ్ల‌తో ఆల్రెడీ సంప్ర‌దింపులు పూర్త‌య్యాయ‌ని గుసగుస‌లు వినిపిస్తున్నాయి. దీంతో ఆ న‌లుగురు హీరోలు ఎవ‌రు? అంటూ అభిమానుల్లో ఆస‌క్తి నెల‌కొంది. అలాగే హోస్ట్ ఎవ‌రు? అన్న‌ది కూడా ఇంటి నిర్వాహ‌కులు ప్ర‌క‌టించాల్సి ఉంది. తొలి మూడు సీజ‌న్ల‌కు క్రేజు తెచ్చింది హోస్ట్ లే. ఎన్టీఆర్ .. నాని.. నాగార్జున ఎవ‌రికి వారు త‌మ ప్ర‌త్యేక‌త‌ను నిలుపుకున్నారు. ఈసారి హోస్ట్ ఎవ‌రు? అన్న‌దే ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. దాంతో పాటు ఇంటి స‌భ్యుల్లో న‌లుగురు హీరోలకు చోటివ్వ‌డం ఉత్కంఠ పెంచేదే. అయితే వీట‌న్నిటికీ మించి గ్లామ‌ర్ కంటెంట్ ఎంత‌? అన్న‌ది కూడా బిగ్ బాస్ వీక్ష‌కుల్ని ప్ర‌భావితం చేస్తుంద‌నేది లోగుట్టు.

హీరోలు ఎవ‌రెవ‌రు? అంటే.. ఆర్.ఎక్స్ 100 ఫేం కార్తికేయ.. గుంటూరు టాకీస్ ఫేం సిద్ధు జొన్నలగడ్డ.. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సుధాక‌ర్ కోమాకుల‌.. గ‌రుడ‌వేగ ఫేం అదితి అరుణ్ .. లను ఆఫ‌ర్ వ‌రించింద‌ట‌. వీళ్ల‌తో పాటే మ‌రో ఇద్ద‌రు యువ నాయిక‌లు ఇంటి స‌భ్యులుగా ఉంటార‌న్న‌ది తాజా లీక్.