Begin typing your search above and press return to search.

బిగ్‌ బాస్‌ 4 సస్పెన్స్‌ రివీల్‌ చేసిన వికీపీడియా

By:  Tupaki Desk   |   23 Aug 2020 1:02 PM GMT
బిగ్‌ బాస్‌ 4 సస్పెన్స్‌ రివీల్‌ చేసిన వికీపీడియా
X
తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 అధికారిక ప్రకటన వచ్చి చాలా రోజులు అవుతుంది. కాని ఇప్పటి వరకు తేదీ విషయంలో ఎలాంటి ప్రకటన రాలేదు. నాగార్జున ప్రోమో విడుదల చేయడంతో త్వరలో అనే విషయంలో క్లారిటీ వచ్చింది. కాని ఎప్పుడు ఎప్పుడు అంటూ ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో వికీపీడీయా ఈ సస్పెన్స్‌ కు తెర దించింది. వికీపీడియాలో తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 పేరుతో ఒక పేజ్‌ ను క్రియేట్‌ చేయడం జరిగింది. అది షో నిర్వాహకులు క్రియేట్‌ చేసి ఉంటారు అనిపిస్తుంది. అందులో షో ప్రారంభ తేదీపై క్లారిటీ ఇచ్చారు.

ఈ షోను జూన్‌ లోనే ప్రారంభించాలని అనుకున్నా కరోనా కారణంగా ఆలస్యం అయ్యిందని ఆగస్టు 30 నుండి ఈ షోను ప్రసారం చేయబోతున్నట్లుగా వికీపీడియాలో పేర్కొన్నారు. ఈ షోను 105 రోజులుగా నిర్వాహకులు ప్లాన్‌ చేశారని మొదటగా 15 మంది కంటెస్టెంట్స్‌ లోనికి వెళ్తారు అంటూ కూడా అందులో పేర్కొన్నారు. మొత్తానికి షో ప్రారంభంపై అనధికారికంగా క్లారిటీ వచ్చేసింది. ఇక షో ఫార్మట్‌ విషయంలో కూడా ఈసారి అనేక వార్తలు వస్తున్నాయి. కరోనా కారణంగా కొత్తగా ఉంటుందని చెబుతున్నారు. ఆ విషయంలో క్లారిటీ రావాలంటే షో ప్రారంభం అవ్వాల్సిందే. ఒకటి రెండు రోజుల్లో డేట్‌ ప్రోమో విడుదల చేసే అవకాశం ఉంది.