Begin typing your search above and press return to search.

#BB3 : 20ల‌క్ష‌లు వ‌దులుకున్న మూర్ఖులు

By:  Tupaki Desk   |   3 Nov 2019 3:58 PM GMT
#BB3 : 20ల‌క్ష‌లు వ‌దులుకున్న మూర్ఖులు
X
బిగ్ బాస్ 3 గ్రాండ్ ఫినాలే నేడు ముగుస్తోంది. ఆదివారం సాయంత్రం టీవీల ముందు కూచున్న ఆడియెన్ ఎమోష‌న్స్ గురించి ఏమ‌ని చెప్పాలి? మ‌ధ్య‌లో కేబుల్ క‌నెక్ష‌న్ క‌ట్ అయితే కేబుల్ వాడి టెంక ప‌గ‌ల‌గొడ‌తాం అన్న‌ట్టుగానే అంద‌రి ముఖాల్లో ఫీలింగ్. సాంప్ర‌దాయ వాదులు ఎంత కాద‌న్నా ఓ సెక్ష‌న్ ఆడియెన్ బిగ్ బాస్ కి బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు కాబ‌ట్టి వీళ్లంద‌రి ఫీలింగ్ ఇదీ..

హోస్ట్ నాగార్జున స‌స్పెన్స్ కోసం చాలానే తాప‌త్రాయ ప‌డ్డారు. బిగ్ బాస్ ఇంటి నుంచి తొలిగా ప్ర‌తిరోజు పండ‌గే టీమ్ నుంచి రాశీఖ‌న్నా- మారుతి వ‌చ్చి అలీ ర‌జాను ఇంటినుంచి బ‌య‌ట‌కు పంపేశారు. తొలి వికెట్ డౌన్. మ‌రి మిగిలిన న‌లుగురిలో ఒక్కొక్క‌రిని బ‌య‌టికి పంపి చివ‌రికి విజేత‌ను ప్ర‌క‌టించేదెప్పుడు? ఇక్క‌డే ఉంది ట్విస్టు. ఇంకో ముగ్గురిని బ‌య‌టికి పంపించే లోపు ఒక పూటంతా ఈ షోని చూడాల్సిందే మ‌రి. ఎందుకంటే ఈ మ‌ధ్య‌లోనే పిచ్చి పిచ్చి మెడ్లీలు.. ఐటెమ్ నంబ‌ర్లు అంటూ చాలానే ఉన్నాయి. ఎంట‌ర్ టైన్ మెంట్ పేరుతో రొద పెట్టే కార్య‌క్ర‌మాల్ని ఎవ‌రు డిజైన్ చేశారో కానీ బిగ్ బాస్ లో అస‌లు కంటే కొస‌రు ఎక్కువైపోయింది.

ఎట్ట‌కేల‌కు రెండో ఎలిమినేష‌న్ టైమ్ అయ్యింది. ఈసారి ఎవ‌రు ఇంటినుంచి వెళ‌తారు? అన్న‌ది స‌స్పెన్స్. ఈసారి పంపేవాళ్లు హీరో శ్రీ‌కాంత్ - కేథ‌రిన్ థ్రెస్సా. శ్రీ‌కాంత్ వ‌స్తూనే ఓ సూట్ కేస్ తెచ్చాడు. అందులో 10ల‌క్ష‌ల క్యాష్ ఉంది. ఎవ‌రైనా ఆ క్యాష్ తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోవ‌చ్చు అన్నారు. ఇంట్లో ఒక‌టే ఊగిస‌లాట‌. వెళ్లాలా వ‌ద్దా? ఎవ‌రూ వెళ్ల‌లేదు. ఎవ‌రికి వారు గెలుస్తామ‌నుకుంటున్నారు. మ‌రో ట్విస్టు ఇంత‌లోనే. ఈసారి మ‌రో సూట్ కేస్ తెచ్చాడు హీరో శ్రీ‌కాంత్. అందులో 10ల‌క్ష‌లు. మొత్తం 20 ల‌క్ష‌లు తీసుకుని ఎవ‌రైనా వెళ్లిపోవ‌చ్చు. బాబా మాస్టార్ అటూ ఇటూ ఊగి ఆగిపోయాడు. ఎట్ట‌కేల‌కు శ్రీ‌కాంత్ రెండో వ్య‌క్తిని ఎలిమినేట్ చేశాడు. ఈసారి హీరో వ‌రుణ్ సందేశ్ వెళ్లిపోయాడు. పాపం బ‌య‌ట వితిక శేరు ఇది న‌మ్మ‌లేన‌ట్టుగా షాక్ తిని అలా ఉండిపోయింది. ఇంకో ముగ్గురున్నారు. రాహుల్-బాబా భాస్క‌ర్- శ్రీ‌ముఖి.. మ‌రి వీళ్ల‌లో ఇంకెవ‌రు బ‌య‌టికి వెళ‌తారో.. ఈసారి ఎంత క్యాష్ ఆఫ‌రిస్తారో? జ‌స్ట్ వెయిట్..