Begin typing your search above and press return to search.

BBS3 : మళ్లీ వరుణ్‌ మాట విన్న పున్ను

By:  Tupaki Desk   |   13 Sep 2019 4:59 AM GMT
BBS3 : మళ్లీ వరుణ్‌ మాట విన్న పున్ను
X
తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 3లో ప్రత్యేక ఆకర్షణగా పునర్నవి నిలుస్తోంది. ఆమెకు సంబంధించిన ప్రతి విషయంపై ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. గతంలో తనకు తాను నామినేట్‌ చేసుకుంటాను అంటూ ప్రకటించి బిగ్‌ బాస్‌ నిర్ణయాన్ని దిక్కరించింది. ఇంటి సభ్యులు అందరు నామినేట్‌ అయినా పర్వాలేదు అంటూ బిగ్‌ బాస్‌ కే షాక్‌ ఇచ్చింది. ఆ సమయంలో ఆమెను ఇంటి సభ్యులు పలువురు నామినేషన్‌ పక్రియలో పాల్గొనేందుకు ఒప్పించారు. చివరకు వరుణ్‌ సందేశ్‌ పక్కకు తీసుకు వెళ్లి మాట్లాడిన తర్వాత అప్పుడు పునర్నవి కన్విన్స్‌ అయ్యింది.

తాజాగా ఈ వారం బిగ్‌ బాస్‌ ఇచ్చిన ఇంట్లో దెయ్యం నాకేం భయం టాస్క్‌ లో చెత్త ప్రదర్శణ చేసినందుకు గాను శ్రీముఖి.. మహేష్‌ విట్టా ఇంకా పునర్నవికి శిక్ష విధించడం జరిగింది. షూష్‌ పాలీస్‌ చేయడం బిగ్‌ బాస్‌ వీరికి ఇచ్చిన టాస్క్‌. శ్రీముఖి వెంటనే చేసేందుకు ఓకే చెప్పగా మహేష్‌ మొదట నో అన్నా ఆ తర్వాత శివ జ్యోతి చెప్పడంతో అతడు కూడా షూష్‌ పాలీష్‌ చేసేందుకు సిద్దం అయ్యాడు. కాని ఎంత మంది చెప్పినా కూడా పునర్నవి మాత్రం షూష్‌ పాలీష్‌ చేసేందుకు నో చెప్పింది.

ఇచ్చిన శిక్ష టాస్క్‌ ను పూర్తి చేయకుంటే వచ్చే వారం నేరుగా నామినేట్‌ అవుతారు అంటూ హెచ్చరించినా కూడా పునర్నవి పట్టించుకోలేదు. శ్రీముఖి మరియు మహేష్‌ లు తమ టాస్క్‌ పూర్తి చేసిన తర్వాత వరుణ్‌ చాలా ఓపికగా ఆమెను ఒప్పించడంతో అప్పుడు సరే పదా అంటూ షూష్‌ క్లీన్‌ చేసింది. టాస్క్‌ పూర్తి అయిన తర్వాత బిగ్‌ బాస్‌ ను స్వీట్‌ గా తిడుతూనే తిట్టినందుకు సారీ చెప్పింది. నువ్వు మామూలోడివి కాదు బిగ్‌ బాస్‌ అంటూ సరదాగా కామెంట్స్‌ చేసింది.

మొత్తానికి నిన్నటి ఎపిసోడ్‌ లో పునర్నవి మరోసారి వరుణ్‌ మాట విని బిగ్‌ బాస్‌ చెప్పిన మాట విన్నది. దీంతో బిగ్‌ బాస్‌ మాట కంటే పునర్నవి వరుణ్‌ మాటే ఎక్కువగా వింటుందని సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ వస్తున్నాయి.