Begin typing your search above and press return to search.

బిగ్‌ బాస్‌ 3 అప్‌ డేట్స్‌

By:  Tupaki Desk   |   3 March 2019 12:53 PM GMT
బిగ్‌ బాస్‌ 3 అప్‌ డేట్స్‌
X
తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 3 ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అంటూ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదటి సీజన్‌ కు ఎన్టీఆర్‌ హోస్ట్‌ గా వ్యవహరించగా, రెండవ సీజన్‌ కు నాని హోస్ట్‌ గా వ్యవహరించిన విషయం తెల్సిందే. మొదటి సీజన్‌ కు వచ్చినంతగా టీఆర్పీ రేటింగ్‌ సెకండ్‌ సీజన్‌ కు రాలేదని చెప్పాలి. అయితే కౌశల్‌ ఆర్మీ హడావుడి వల్ల బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 కూడా ఒక మోస్తరుగా నడిచింది. అయితే మూడవ సీజన్‌ కు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులు భావిస్తున్నారు.

రెండవ సీజన్‌ లో ప్రముఖ సెలబ్రెటీలు లేకోవడంతో ప్రేక్షకులు ఆసక్తి చూపించలేదు అనేది ఒక వాదన. అందుకే మూడవ సీజన్‌ లో సెలబ్రెటీల విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోవాలని భావిస్తున్నారు. మూడవ సీజన్‌ కు సంబంధించిన అఫిషియల్‌ అనౌన్స్‌ మెంట్‌ జూన్‌ లో చేసేందుకు బిగ్‌ బాస్‌ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 ఎక్కడైతే నిర్వహించారో అక్కడే సీజన్‌ 3 ని కూడా నిర్వహించనున్నారు.

ఇక సీజన్‌ 3కి ఎన్టీఆర్‌ హోస్ట్‌ గా వ్యవహరిస్తాడనే ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు అందుకు సంబంధించిన ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. మరో వైపు సీజన్‌ 3లో సీనియర్‌ యాంకర్‌ ఉదయభాను, జేడీ చక్రవర్తి, మరో యాంకర్‌ మంజుష, వరుణ్‌ సందేశ్‌, పూజిత పొన్నాడ ఇంకా పలువురు సెలబ్రెటీలను ఎంపిక చేసేందుకు కసరత్తు జరుగుతుంది. ఈసారి సామాన్యులకు నో ఎంట్రీ అనే ప్రచారం కూడా జరుగుతుంది. మొత్తానికి రెండవ సీజన్‌ లో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా మూడవ సీజన్‌ ను మొదలు పెట్టాలని భావిస్తున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఆగస్టు లేదా సెప్టెంబర్‌ లో మూడవ సీజన్‌ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.