Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ హంగామా ఆరోజు నుంచి షురూ!

By:  Tupaki Desk   |   3 July 2019 11:50 AM GMT
బిగ్ బాస్ హంగామా ఆరోజు నుంచి షురూ!
X
మొదటి సీజన్ బిగ్ బాస్ కు ముందు అసలు తెలుగు ప్రేక్షకులకు ఇలాంటి రియాలిటీ షోలు సెట్ కావు అని.. ఇక్కడ బిగ్ బాస్ క్లిక్ కాదని అన్నారు. కానీ ఫస్ట్ సీజన్ అయిపొయింది. రెండో సీజన్ అయిపోయింది. వివాదాలతో సంబంధం లేకుండా బిగ్ బాస్ పై ఆదరణ పెరుగుతూనే ఉంది. ఇప్పుడు మూడో సీజన్ కు రంగం సిద్ధం అయింది.

'కింగ్' అక్కినేని నాగార్జున ఈ మూడవ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరిస్తారనే సంగతి తెలిసిందే. హౌస్ మేట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకూ దాదాపు నలభై మందిని ఎంపిక చేశారని.. ఆ లిస్టులోనుంచి 14 మందిని ఫైనలైజ్ చెయ్యాల్సి ఉందని సమాచారం. ఈ వీకెండ్ లో ఫైనల్ లిస్టు రెడీ అవుతుందట. ఇప్పటివరకూ ఫైనల్ లిస్టులో స్థానం సాధించిన వారు యాంకర్ శ్రీముఖి మాత్రమేనని టాక్ ఉంది.

జులై 21 నుంచి బిగ్ బాస్ 3 వ సీజన్ ప్రారంభం అవుతుందని.. త్వరలో ఈ విషయాన్ని నిర్వాహకులు అధికారికంగా ప్రకటిస్తారట. ఇక బిగ్ బాస్ 3 వ్యూయర్ షిప్ పెంచేందుకు ఈసారి కూడా మంచి ప్లాన్లే వేసుకొని రంగంలోకి దిగుతున్నారట. కొత్త సినిమాల టీమ్ మెంబర్స్ ను బిగ్ బాస్ కు తీసుకురావడం.. స్పెషల్ గెస్టులను పిలవడం లాంటి వాటితో పాటు టీఆర్పీని పెంచేందుకు వేరే కొత్త ట్రిక్కులు కూడా వాడబోతున్నారట.