Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 3 అక్కడ ఫాస్ట్ గా ఉంది

By:  Tupaki Desk   |   9 May 2019 5:16 AM GMT
బిగ్ బాస్ 3 అక్కడ ఫాస్ట్ గా ఉంది
X
తెలుగులో మొదటి సీజన్ జూనియర్ ఎన్టీఆర్ తో రెండో సిరీస్ నానితో నడిచిన రియాలిటీ షో బిగ్ బాస్ మూడో భాగానికి సంబంధించిన యాంకర్ సెలక్షన్ ఎంతకీ ఓ కొలిక్కి రావడం లేదు. వెంకటేష్-రానా-అల్లు అర్జున్-విజయ్ దేవరకొండ ఇలా ఏవేవో పేర్లు వినిపించాయి కానీ ఇటీవలే కింగ్ నాగార్జున ఫైనల్ అయ్యాడనే టాక్ కూడా బలంగా ప్రచారమయ్యింది. కానీ షూటింగ్ మాత్రం ఇప్పటిదాకా మొదలుపెట్టనే లేదు. ఎప్పుడు అనే క్లారిటీ కూడా లేదు. పైగా నాగ్ కూడా మన్మథుడు 2 షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నాడు. ఎప్పుడు ఫ్రీ అవుతాడో తెలియదు.

కానీ పొరుగున తమిళనాడులో మాత్రం బిగ్ బాస్ 3 కి రంగం సిద్ధమయ్యింది. యాంకర్ గా కమల్ హాసనే మూడో సారి బాధ్యతలు తీసుకోబోతున్నాడు. ఈ మేరకు ప్రోమోలకు సంబంధించి చెన్నై పొన్నామలే ప్రాంతంలో ప్రత్యేకంగా వేసిన సెట్ లో షూట్ కూడా జరిగింది. మే 23 ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక ఇవి టెలికాస్ట్ కాబోతున్నాయి. పార్టిసిపెంట్స్ ని సెలెక్ట్ చేయడం కూడా అయిపోయిందట. కాకపోతే లిస్ట్ ని సీక్రెట్ గా ఉంచుతున్నారు.

ఇక్కడేమో ఒక్క సీజన్ చేయడానికే హీరోలు దొరకడం లేదు. కోలీవుడ్ లోనేమో కమల్ ఏకంగా మూడు సీజన్లు ఒంటి చేత్తో నడిపించాడు. హిందీలో సల్మాన్ ఖాన్ ఏకంగా 11 సీజన్లు రన్ చేయడం తెలిసిందే. తెలుగులో మాత్రమే ఎందుకు ఇలా జరుగుతోందో నిర్వాహకులకు అంతు చిక్కడం లేదు. వచ్చే నెల నుంచి బిగ్ బాస్ 3 తమిళ్ స్టార్ట్ కానుండగా తెలుగులో అప్పటికైనా యాంకర్ దొరుకుతారో లేదో వేచి చూడాలి