Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ హౌస్ లో మ‌హా సుడిగాడు ఎవ‌రంటే?

By:  Tupaki Desk   |   4 Aug 2018 4:53 AM GMT
బిగ్ బాస్ హౌస్ లో మ‌హా సుడిగాడు ఎవ‌రంటే?
X
ఏమైనా జ‌ర‌గొచ్చ‌న్న మాట‌తో న‌డుస్తున్న బిగ్ బాస్ సీజ‌న్ 2లో ఊహించ‌ని ప‌రిణామం ఎదురైంది. హౌస్ మేట్స్ కు స్వీట్ షాకిస్తూ.. లోక‌నాయకుడు క‌మ‌ల్ హాస‌న్ హౌస్ లోకి వ‌చ్చారు. విశ్వ‌రూపం 2 ప్ర‌మోష‌న్లో భాగంగా వ‌చ్చిన ఆయ‌న పుణ్య‌మా అని కొత్త క‌ళ‌ను సంత‌రించుకుంది.

క‌మ‌ల్ ఎంట్రీని విప‌రీత‌మైన ఎగ్జైంటీగా ఫీల్ కావ‌ట‌మే కాదు.. హౌస్ మొత్తం కొత్త క‌ళ‌ను సంత‌రించుకుంది. క‌మ‌ల్ ఎదుట త‌మ ప్ర‌తిభ‌ను ప్ర‌ద‌ర్శించారు హౌస్ మేట్స్‌. క‌మ‌ల్ న‌టించిన నాటి గుణ మూవీలోని ప్రియ‌తమా నీవ‌చ‌ట కుశ‌ల‌మా పాట‌తో ఆక‌ట్టుకుంటే.. రోల్ రైడా త‌న స్టైల్లో ర్యాప్ పాడి హుషారు పుట్టించాడు. ఇక‌.. అమిత్ త‌నకెంతో ఇష్ట‌మైన ట్యూన్ ను వినిపించాడు. ఇలా ఎవ‌రికి వారు వారి టాలెంట్‌ ను క‌మ‌ల్ ముందు ప్ర‌ద‌ర్శించేందుకు ప్ర‌య‌త్నించారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. బంప‌ర్ ఆఫ‌ర్ ను ప్ర‌క‌టించి హౌస్ మేట్స్ ను ఆశ్చ‌ర్య‌చ‌కితుల్నిచేశారు క‌మ‌ల్‌. హౌస్ మొత్తంలో ఒక‌రికి రెండు వారాల పాటు ఎలిమినేష‌న్ కాకుండా ఉండేలా ప‌వ‌ర్ ఇస్తాన‌న్న ఆయ‌న‌.. బాగా పేరు ప్ర‌ఖ్యాతలు.. బాగా పోటీ ఇచ్చే కంటెస్టెంట్‌ కు ఆ ఛాన్స్ ఇవ్వ‌న‌ని చెప్పారు.

కాస్త వెనుక‌బ‌డిన వ్య‌క్తికి తానీ ప‌వ‌ర్ ఇస్తాన‌ని ఊరించిన క‌మ‌ల్.. చివ‌ర‌కు ఆ ల‌క్కీఫెలో అమిత్ అని తేల్చేశారు. త‌న నిర్ణ‌యం స‌రైన‌ది కాక‌పోవ‌చ్చ‌ని..అయినా తాను ఇచ్చేస్తున్న‌ట్లుగా చెప్పారు. క‌మ‌ల్ నిర్ణ‌యంతో అమిత్ ఒకింత ఆశ్చ‌ర్యానికి గురి కావ‌టంతో పాటు.. రెండు వారాల పాటు సేఫ్ అయ్యారు. ఈ వారం నుంచి వ‌రుస‌గా ఇద్ద‌రు చొప్పున ఎలిమినేట్ అవ్వొచ్చ‌న్న మాట వినిపిస్తున్న వేళ‌.. రెండు వారాల పాటు సేఫ్ జోన్లో ఉండ‌టం చూస్తే.. అమిత్ మ‌హా సుడిగాడ‌య్యా.. అన్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం.