Begin typing your search above and press return to search.

ఈ సునామి దేనికి సంకేతం?

By:  Tupaki Desk   |   29 Sep 2018 10:45 AM GMT
ఈ సునామి దేనికి సంకేతం?
X
తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ చివరి దశకు చేరిపోయింది. రేపటి ఎపిసోడ్‌ తో ఈ షో పూర్తి కాబోతున్న విషయం తెల్సిందే. రేపటి ఎపిసోడ్‌ కు సంబంధించిన చిత్రీకరణ నేడే పూర్తి చేస్తారనే టాక్‌ వినిపిస్తుంది. నేడు రాత్రికి విజేత ఎవరు అనే విషయంపై క్లారిటీ రాబోతుంది. ఫైనల్‌ లో ఉన్న అయిదుగురు కౌశల్‌ - దీప్తి - గీతా మాధురి - తనీష్‌ - సామ్రాట్‌. ఈ అయిదుగురిలో కౌశల్‌ విజేత అవ్వడం ఖాయం అంటూ మొదటి నుండి సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతూనే ఉంది.

ఇక ఫైనల్‌ వారం ఓట్ల విషయానికి వస్తే స్టార్‌ మా వారు - షో నిర్వాహకులు కూడా షాక్‌ అయ్యేలా ఓటింగ్‌ నమోదు అవుతున్నాయి. కౌశల్‌ ఎప్పుడు నామినేసన్స్‌ లో ఉన్నా కూడా భారీ ఎత్తున ఓట్లు పడుతూనే ఉంటాయి అంటూ గతంలో పలు సందర్బాల్లో వెళ్లడి అయ్యింది. తాజాగా కౌశల్‌ ఫైనల్‌ లో ఉన్న కారణంగా ఆయన్ను గెలిపించేందుకు పెద్ద ఎత్తున ఓట్లు వేయాల్సిందిగా కౌశల్‌ ఆర్మీ నిర్ణయించుకుని దండిగా ఓట్లు వేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.

ఈ వారం రోజుల్లో కొన్ని కోట్లకు పైగా ఓట్లు పడ్డట్లుగా అనధికారిక సమాచారం అందుతుంది. ఇతర భాషల్లో ప్రసారం అవుతున్న బిగ్‌ బాస్‌ కు పడుతున్న ఓట్లను చూసుకుంటే తెలుగు బిగ్‌ బాస్‌ ఓట్లు రికార్డుగా చెబుతున్నారు. ఫినాలేలో కౌశల్‌ ముందు స్థానంలో ఉంటాడని అంతా అంటున్నారు. అయితే దీప్తి విషయంలో ఏదో జరుగుతుందని, ఆమె కూడా ముందు స్థానంలో ఉండే అవకాశం ఉందని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా అద్బుతం జరిగితే తప్ప మిగిలిన ముగ్గురు టైటిల్‌ ను పట్టుకోలేరు అంటూ సోషల్‌ మీడియాలో టాక్‌ వినిపిస్తుంది. మొత్తానికి ఓట్లు కోట్లల్లో రావడంతో ప్రేక్షకులు ఇది దేనికి సంకేతం అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.