Begin typing your search above and press return to search.

బిబి4 : హోటల్‌ టాస్క్‌ రెచ్చిపోయారు.. అవినాష్‌ కు సీక్రెట్‌ టాస్క్‌

By:  Tupaki Desk   |   7 Oct 2020 9:00 AM IST
బిబి4 : హోటల్‌ టాస్క్‌ రెచ్చిపోయారు.. అవినాష్‌ కు సీక్రెట్‌ టాస్క్‌
X
సోమవారం ఎపిసోడ్‌ మొత్తం కూడా నామినేషన్‌ పక్రియ జరిగింది. అందుకు సంబంధించిన చర్చ నిన్నటి ఎపిసోడ్‌ లో కూడా టెలికాస్ట్‌ అయ్యింది. నామినేషన్‌ సందర్బంగా పప్పు గురించి దివి మాట్లాడటంతో లాస్య చాలా బాధపడింది. వెక్కి వెక్కి ఏడ్చింది. గంగవ్వ లాస్యను ఓదార్చేందుకు చాలా ప్రయత్నించింది. ఇక రాజశేఖర్‌ మాస్టర్‌ ను నోయల్‌ నామినేట్‌ చేశాడు. దాన్ని మాస్టర్‌ అస్సలు తీసుకోలేక పోయాడు. ఇద్దరి మద్య వాదన జరిగింది. అర్థరాత్రి దాటే వరకు మోనాల్‌ ఏడుస్తూనే ఉంది. తర్వాత రోజు ఇంటి సభ్యులకు బిబి హోటల్‌ టాస్క్‌ ఇవ్వడం జరిగింది. హోటల్‌ టాస్క్‌ లో భాగంగా ముక్కు అవినాష్‌ కు బిగ్‌ బాస్‌ సీక్రెట్‌ టాస్క్‌ ఇచ్చాడు. ఒక జట్టులో ఉండి మరో జట్టు కోసం చేయాల్సిందిగా బిగ్‌ బాస్‌ ఆదేశించాడు.

బిబి హోటల్‌ కు వచ్చే గెస్ట్‌ లకు సేవ చేయడం ద్వారా 5 స్టార్‌ లు పొందాల్సి ఉంటుంది. హోటల్‌ టీం మేనేజర్‌ అభిజిత్‌.. అఖిల్‌ సెక్యూరిటీ.. లాస్య సుజాత చెఫ్‌.. మాస్టర్‌ సర్వింగ్‌.. దివి మోనాల్‌ లు స్పా.. అవినాష్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌గా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇక గెస్ట్‌ లుగా మెహబూబ్‌.. సోహెల్‌.. అరియానా.. గంగవ్వ.. హారికలు ధనవంతులుగా వ్యవహరించాల్సి ఉంటుంది. హోటల్‌ సిబ్బందికి వీరు చుక్కలు చూపించారు. హారిక ను అవినాష్‌ అవమానించినట్లుగా వ్యవహరించాడు. దాంతో ఆమె హర్ట్‌ అయ్యింది. ఆమెకు సారీ చెప్పినా కూడా పట్టించుకోలేదు. ఇక ప్రిన్సెస్‌ అయిన అరియానాను పదే పదే అవినాష్‌ చిరాకు పెట్టడంతో ఆమె అతడికి పనిష్మెంట్‌ ఇచ్చింది.

చెంచాతో బకీటులో నీళ్లు నింపాలంటూ అవినాష్‌ కు చెప్పింది. నా చేయి పట్టుకున్నాడని నాకు ముద్దు పెట్టబోయాడు అంటూ అవినాష్‌ పై అరియానా కంప్లైంట్‌ చేసింది. అవినాష్‌ తనకు ఇచ్చిన సీక్రెట్‌ టాస్క్‌ లో దూసుకు పోతున్నాడు. హోటల్‌ కు వచ్చిన అతిథులను విసిగిస్తూ హోటల్‌ సిబ్బందికి స్టార్స్‌ లేదా టిప్పు రాకుండా చేస్తున్నాడు. అతిథుల కోసం వండుతున్న వంటలో అవినాష్‌ ఉప్పు కలిపాడు. దాంతో అది మరింత రచ్చ అయ్యే అవకాశం ఉంది. మొత్తానికి నిన్నటి ఎపిసోడ్‌ చాలా ఎంటర్‌ టైన్‌మెంట్ తో సాగిపోయింది. నేటి ఎపిసోడ్‌ లో కాస్త సీరియస్‌గా టాస్క్‌ మారే అవకాశం ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఈ వారం కెప్టెన్సీ పోటీ టాస్క్‌ అయిన బిబి హోటల్‌ ముందు ముందు ఎలాంటి టర్న్‌ లు తీసుకుంటుందా చూడాలి.