Begin typing your search above and press return to search.

బిగ్గెస్ట్ రియాలిటీ షో కొత్త సీజన్ ఎప్పుడంటే..?

By:  Tupaki Desk   |   5 Jun 2021 2:30 AM GMT
బిగ్గెస్ట్ రియాలిటీ షో కొత్త సీజన్ ఎప్పుడంటే..?
X
ఇండియన్ టీవీ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ రియాలిటీ షోలలో 'బిగ్ బాస్‌' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. హిందీ, తెలుగు, తమిళం‌, కన్నడం, మలయాళం.. ఇలా అన్ని భాషల్లోనూ ఈ షో ప్రజాదరణ పొందింది. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అసలైన మజాని పరిచయం చేసిన 'బిగ్ బాస్'.. ఇప్పటి వరకు నాలుగు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో 'బిగ్ బాస్ తెలుగు 5' ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

కరోనా ఫస్ట్ వేవ్ కారణంగా జూన్‌ లోనే రావాల్సిన 'బిగ్ బాస్' సీజన్-4 సెప్టెంబర్‌ లో వచ్చింది. స్టార్ మా నిర్వహణలో మూడున్నర నెలల పాటు సాగిన ఈ సీజన్ కు 'కింగ్' అక్కినేని నాగార్జున హోస్ట్ చేశారు. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ కారణంగా సీజన్-5 కూడా ఆలస్యంగా ప్రారంభం కానుంది. 'బిగ్ బాస్' షోని మే నెల ఎండింగ్ లో లేదా జూన్ ఫస్ట్ వీక్ లో మొదలు పెట్టాలని నిర్వాహకులు ముందుగా ప్లాన్ చేసుకున్నారట. అయితే ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఐదో సీజన్ ని జులై నెలలో స్టార్ట్ చేయాలని చూస్తున్నారట.

ఇకపోతే గత రెండు సీజన్లను సక్సెస్ ఫుల్ గా నడిపించిన నాగార్జున ఇప్పుడు సీజన్-5 కి కూడా హోస్టుగా వ్యవహరిస్తారని టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రాబోతోందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.