Begin typing your search above and press return to search.

VD10 టైటిల్‌ తేల్చలేక పోతున్నారట

By:  Tupaki Desk   |   10 March 2020 5:39 AM GMT
VD10 టైటిల్‌ తేల్చలేక పోతున్నారట
X
విజయ్‌ దేవరకొండ 10వ చిత్రం పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. అనన్య పాండే హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ సినిమాను పూరి ఇంకా ఛార్మిల తో పాటు బాలీవుడ్‌ స్టార్‌ ఫిల్మ్‌ మేకర్‌ కరణ్‌ జోహార్‌ కూడా నిర్మిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాను కేవలం తెలుగులోనే కాకుండా హిందీ ఇంకా తమిళం లో కూడా విడుదల చేయాలని భావిస్తున్నారు. అన్ని భాషలకు ఒకే టైటిల్‌ ఉంటే ప్రమోషన్స్‌ విషయంలో హెల్ప్‌ ఫుల్‌ గా ఉంటుందని అంతా అనుకుంటున్నారు.

పూరి మొదట 'ఫైటర్‌' అనే టైటిల్‌ ను అనుకున్నాడు. ఆ టైటిల్‌ తర్వాత 'లైగర్‌' అనే టైటిల్‌ ప్రచారం జరిగింది. ఈ రెండు టైటిల్స్‌ పట్ల నిర్మాత కరణ్‌ జోహార్‌ ఆసక్తి గా లేడని తెలుస్తోంది. పూరి ఒక వేళ ఈ టైటిల్స్‌ లో ఏదో ఒకదానితో తెలుగులో విడుదల చేసినా తాను మాత్రం హిందీలో మరేదైనా టైటిల్‌ తో వెళ్లాలని భావిస్తున్నాడట. కరణ్‌ జోహార్‌ టైటిల్స్‌ విషయంలో పూరితో విభేదిస్తున్న కారణంగా ప్రస్తుతం చర్చలు సీరియస్‌ గా జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఇటీవలే ముంబయిలో రెండవ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్‌ సభ్యులు వెంట వెంటనే పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా చేయిస్తున్నట్లు గా సమాచారం అందుతోంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా టైటిల్‌ ను త్వరలోనే రివీల్‌ చేసి ఉగది న ఫస్ట్‌ లుక్‌ విడుదల చేస్తే బాగుంటుందని విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. మరి ఉగాదికి రౌడీ ఫ్యాన్స్‌ కు ప్రత్యేకంగా ఏమైనా ట్రీట్‌ ఉంటుందా చూడాలి.