Begin typing your search above and press return to search.

అమెజాన్ దూకుడుకి బ్రేకులు పడతాయా

By:  Tupaki Desk   |   21 March 2019 1:30 AM GMT
అమెజాన్ దూకుడుకి బ్రేకులు పడతాయా
X
గత ఏడాదిన్నర కాలంగా డిజిటిల్ సినిమాలో విప్లవంలా దూసుకువచ్చిన అమెజాన్ ప్రైమ్ గత మూడు నెలల నుంచి స్పీడ్ ఇంకా పెంచింది. సంక్రాంతికి వచ్చిన క్రేజీ మూవీస్ అన్ని కేవలం నెల రోజుల గ్యాప్ తో ఆన్ లైన్ లో పెట్టేయడంతో ఇది తీవ్ర చర్చకు దారి తీసింది. ముఖ్యంగా ఎఫ్2 వసూళ్లు ఉదృతంగా ఉన్న టైంలోనే స్ట్రీమింగ్ కు రావడం బాగా ప్రభావం చూపించింది.

ఇప్పుడు టాలీవుడ్ నిర్మాతలు తీసుకున్న 60 రోజుల నిర్ణయం పైకి చూసేందుకు బాగానే ఉన్నప్పటికీ నిజంగా అమెజాన్ నెట్ ఫ్లిక్స్ లాంటి వాటికి బ్రేకులు వేస్తుందా అనే అనుమానాలు లేకపోలేదు. రానున్న రోజుల్లో డిజిటల్ కంటెంట్ రాజ్యమేలే రోజులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కోట్ల రూపాయల పెట్టుబడితో అక్షయ్ కుమార్ సైఫ్ అలీ ఖాన్ మాధవన్ లాంటి స్టార్లతో సినిమాలకు ఏ మాత్రం తీసిపోని కంటెంట్ తో అమెజాన్ నానా రచ్చ చేస్తోంది

జీ 5 సంస్థ రానున్న రోజుల్లో సుమారు 72 ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టిందని సమాచారం. దీనికి గాను 200 కోట్ల పెట్టుబడులతో ప్రణాళికలు సిద్ధం చేశారట. అమెజాన్ ఒక్క ది ఎండ్ అనే వెబ్ సిరీస్ కోసమే వంద కోట్ల పందేనికి రెడీ అయ్యింది. ఇప్పుడు అరవై రోజుల తర్వాతే మా సినిమా వేసుకోండి అంటే హక్కుల కోసం ఖర్చు పెట్టే మొత్తాన్ని తగ్గించి దాన్ని ఇంకో మార్గంలో పెట్టుబడిగా పెట్టేందుకు ఇవే సంస్థలు ప్లాన్ చేస్తాయి.

ప్రేక్షకులు సైతం 30 లేదా 40 రోజుల కాల వ్యవధి ఇంకో ఇరవై రోజులు అదనంగా పెరుగుతుంది అంటే అంత వరకు ఆగలేక ప్రతి సినిమాని థియేటర్లో చూస్తారన్న గ్యారెంటీ లేదు. ఇది ఎలా ఉన్నా ఇప్పుడీ అరవై రోజుల నిబంధన వల్ల ఎంతో కొంత మేలైతే ఖచ్చితంగా ఉంటుంది. అసలు 30 రోజుల స్ట్రీమింగ్ మొదలు అయ్యిందే దిల్ రాజు సురేష్ బాబు లాంటి నిర్మాతల నుంచే. రాబోయే పరిణామాలు అమెజాన్ లాంటి సంస్థలు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయో వేచి చూడాలి