Begin typing your search above and press return to search.

#Mr గుణ క్లారిటీ.. శ‌కుంత‌ల‌గా అక్కినేని కోడ‌లు

By:  Tupaki Desk   |   2 Jan 2021 9:15 AM IST
#Mr గుణ క్లారిటీ.. శ‌కుంత‌ల‌గా అక్కినేని కోడ‌లు
X
మెగా డైరెక్ట‌ర్ గుణ‌శేఖ‌ర్ చాలా గ్యాప్ త‌ర్వాత శ‌కుంత‌ల సినిమాని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. టైటిల్ పాత్ర‌లో న‌టించే క‌థానాయిక ఎవ‌రు? అన్న‌దానికి ఇన్నాళ్లు ర‌క‌ర‌కాల ఊహాగానాలు సాగాయి. శ‌కుంత‌ల‌గా స‌మంత న‌టించ‌నుంద‌ని ఇంత‌కుముందే రివీల్ చేశాం.

తాజాగా ఆ ఊహాగానాలను నిజం చేస్తూ `శంకుతలం` ద‌ర్శ‌క‌నిర్మాతలు ప్ర‌ధాన నాయిక వివ‌రాల్ని మోష‌న్ పోస్ట‌ర్ ద్వారా ప్రకటించారు. ఇంత‌కీ శ‌కుంత‌ల ఎవ‌రు? అంటే.. ఆమె మరెవరో కాదు. అక్కినేని కోడ‌లు సమంత‌నే ఫైన‌ల్ చేశారు. ‘బిగ్ రివీల్’ అంటూ అధికారికంగా మోషన్ పోస్టర్ ‌ను ఆవిష్కరించి.. ‘ది ఎథెరియల్ అండ్ డెమూర్ .. శకుంతల సమంత’ అంటూ స‌స్పెన్స్ కి తెర దించేశారు.

గుణశేఖర్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ మూవీని రూపొందిస్తున్నాడు. ఇది చారిత్రక ప్రాధాన్య‌త కలిగిన ఇతిహాస‌ ప్రేమకథ. ప్ర‌తిదీ సమంతా త‌న భుజాలపై మోస్తుంది.

ఈ సినిమా క‌థాంశం ఏమిటి? అంటే.. `శకుంతలం` అనేది ప్రేమ వ్యవహారానికి సంబంధించిన‌ది. రహస్య వివాహంపై అస్పష్టతను తొల‌గించే గొప్ప క‌థ‌. దుష్యంతునితో శకుంతల అమర ప్రేమ పునఃకలయికపై ఆద్యంతం రంజైన స్టోరీ ఆక‌ట్టుకుంటుంది. దుష్యంతుడు ఒక రోజున జింకను వేటాడుతూ కణ్వ మహర్షి ఆశ్రమము వైపు వస్తాడు. అక్కడ శకుంతలను చూసి మోహితుడై స్నేహం కోర‌తాడు. శకుంతల తన తండ్రి తనకు చెప్పిన జన్మ వృత్తాంతం వినిపిస్తుంది. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింద‌నేది ఆస‌క్తిక‌రం.

ఇంత‌కీ దుష్యంతుడిగా ఎవ‌రు న‌టిస్తారు? అంటే ఇంకా అధికారికంగా తెలీదు. ఇది బహుభాషా చిత్రం కాబట్టి జనాదరణ ఉన్న ప్ర‌ముఖ క‌థానాయ‌కుడిని ఎంపిక చేసే అవ‌కాశం ఉంటుంద‌ని భావిస్తున్నారు. మణి శర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నీలిమా గుణ నిర్మిస్తున్నారు. మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.