Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో ధ‌నుష్ డి-40 స్పెష‌ల్ మూవీ

By:  Tupaki Desk   |   17 Feb 2020 4:30 PM IST
టాలీవుడ్ లో ధ‌నుష్ డి-40 స్పెష‌ల్ మూవీ
X
త‌మిళ్ హీరో ధ‌నుష్ తెలుగులో మార్కెట్ కోసం ఎప్ప‌టి నుంచో ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. దాదాపు త‌మిళ్ లో న‌టించిన ప్ర‌తీ సినిమా తెలుగు లో రిలీజ్ చేస్తుంటాడు. రిలీజ్ స‌మ‌యంలోప్ర‌త్యేకంగా హైద‌రాబాద్ వ‌చ్చి ఇక్క‌డా బాగానే ప్ర‌మోట్ చేస్తుంటాడు. పేప‌ర్లు..టీవీ ఛానెల్స్..వెబ్ ఇంట‌ర్వూలూ అంటూ అన్నింటిని చుట్టేస్తాడు. కానీ సినిమాలు స‌క్సెస్ అవ్వ‌క‌పోవ‌డంతో ఎఫెర్ట్ అంతా కొన్నేళ్ల‌గా వృద్ధా అవుతూనే ఉంది. ఆ మ‌ధ్య ర‌ఘువ‌ర‌న్ బిటెక్ తో టాలీవుడ్ యూత్ కు బాగా క‌నెక్ట్ అయ్యాడు. ఇంజ‌నీరింగ్ బ్యాక్ డ్రాప్ స్టోరీకి స్టూడెంట్స్ క‌నెక్ట్ అవ్వ‌డంతో ధ‌నుష్ లేస్తున్నాడ‌నే అనిపించింది.

కానీ ఆ సినిమాకు సీక్వెల్ గా వ‌చ్చిన వీఐపీ-2 ఆ అంచ‌నాల‌ను ఒక్క‌సారిగా కొలాప్స్ చేసేసింది. సినిమా లో విష‌యంలో తేక‌పోవ‌డంతో బాక్సాఫీస్ వ‌ద్ద తేలిపోయింది. ఆ ప్లాప్ కు ఇంకా ఇత‌ర‌ చాలా కార‌ణాలే ఉన్నాయి. ఒక వేళ‌ త‌మిళ్ లో హిట్ అయిన సినిమాలు ఇక్క‌డ స‌రైన డిస్ర్టిబ్యూట‌ర్లు..నిర్మాత‌లు చేతుల్లో ప‌డ‌క‌పోవ‌డం..స‌రైన థియేట‌ర్ కుద‌ర‌క‌పోవ‌డం వంటి కార‌ణంగా ధ‌నుష్ వెనుక‌ప‌డ్డాడు. అయితే తాజాగా ధ‌నుష్ కొత్త సినిమాని రెండు..మూడు బ్యాన‌ర్లు క‌లిసి రిలీజ్ చేస్తుండ‌టం..ధ‌నుష్ కెరీర్ కి ప్ల‌స్ గా మారే అవ‌కాశం ఉంద‌న్న ఓ వార్త వెడెక్కిస్తుంది.

ప్ర‌స్తుతం ధ‌నుష్ హీరోగా గ్యాగ్ స్ట‌ర్ నేప‌థ్యం లో డి40 అనే సినిమా లో న‌టిస్తున్నాడు. ఇందులో ధ‌నుష్ డిఫ‌రెంట్ షేడ్స్ ఉన్న పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నాడు. కార్తీక్ సుబ్బ‌రాజ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇటీవ‌లే లండ‌న్ ..త‌మిళ‌నాడు లో చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ నేప‌థ్యంలో తెలుగులో ఈ చిత్రాన్ని మాతృక సంస్థ అయిన‌ వైనాట్ తో క‌లిసి యూవీ క్రియేష‌న్స్ -గీత అనుబంధ సంస్థ జిఏ2 పిక్సర్స్ రిలీజ్ చేస్తున్నాయి. దీంతో డి40 పెద్ద స్కేల్ లో రిలీజ్ ఖాయ‌మ‌ని తెలుస్తుంది. ప్ర‌స్తుతం తెలుగులో స్టార్ హీరోల సినిమాలేవి కూడా రిలీజ్ కి లేవు. ఈ నేప‌థ్యంలో డి40 తెలుగు రాష్ర్టాల్లో భారీ స్థాయి లో రిలీజ్ కానుంది. సినిమా లో కంటెంట్ ఉంటే గ‌నుక స‌క్సెస్ త‌ప్ప‌నిస‌రి. ఈ రిలీజ్ ధ‌నుష్ కు పెద్ద‌ లైఫ్ లైన్ లాంటిదేన‌ని చెప్పొచ్చు. ఇందులో ధ‌నుష్ స‌ర‌స‌న ఐశ్వ‌ర్య ల‌క్ష్మి న‌టిస్తుంది. ఈనెల 19న ఫ‌స్ట్ లుక్..మోష‌న్ పోస్ట‌ర్ రిలీజ్ కానుంది.