Begin typing your search above and press return to search.

ఆ హీరో కోసం కాంబో సెట్ చేశారట

By:  Tupaki Desk   |   27 Nov 2016 11:00 PM IST
ఆ హీరో కోసం కాంబో సెట్ చేశారట
X
ప్రస్తుతం ఏ సినిమాకైనా ఓవర్సీస్ వసూళ్లు ఎంత ముఖ్యమో చూస్తూనే ఉన్నాం. రికార్డ్ కలెక్షన్స్ సాధించడానికి ఇదో ఇంపార్టెంట్ ఏరియా అయిపోయింది. అయితే.. ఓ స్టార్ హీరో గత సినిమా ఫ్లాప్ కావడంతో.. ప్రస్తుతం చేస్తున్న సినిమాను తీసుకునేందుకు.. ఓవర్సీస్ నుంచి డిస్ట్రిబ్యూటర్స్ ఎవరూ రాలేదట.

ఇది ఆ స్టార్ కు దాదాపు షాక్ కొట్టించేసింది. అయితే.. ఇదే హీరోతో తర్వాత సినిమాను కుదుర్చుకున్న ఓ నిర్మాణ సంస్థ రంగంలోకి దిగి డీల్ సెట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా బిజినెస్ దెబ్బ తింటే.. తర్వాత తమ చిత్రానికి కూడా ఇది వర్తిస్తుందనే భయంతోనే ఇలా ఇంటర్ఫియర్ అయ్యారట ఆ ప్రొడ్యూసర్. ఇప్పుడు చేస్తున్నా నిర్మాతతో మాట్లాడి.. తమ సినిమాతో కలిపి.. రెండు సినిమాలకు కాంబో డీల్ సెట్ చేశారని.. అది కూడా తమకు బాగా తెలిసిన సంస్థతోనే కొనిపించారని అంటున్నారు. హీరోను మంచి చేసుకోవడానికి కూడా ఈడీల్ ఉపయోగపడాలన్నది ఆ ప్రొడ్యూసర్ ఉద్దేశ్యం.

రెండు సినిమాలకు కలిపి జడీల్ ను 9 కోట్లకు క్లోజ్ చేశారట. ఇప్పుడు తెరకెక్కిన సినిమా రిజల్ట్ ఒకవేళ తేడా వచ్చినా.. తర్వాతి మూవీని ఓవర్సీస్ లో క్రేజ్ ఉన్న స్టార్ డైరెక్టర్ తీస్తుండడంతో.. నష్టాలకు అవకాశం ఉండదన్నది ఈ డీల్ లో అసలైన పాయింట్ అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/