Begin typing your search above and press return to search.

'నేషనల్ అవార్డు విన్నర్'తో బడా ప్రొడ్యూసర్ భారీ సినిమా..?

By:  Tupaki Desk   |   7 Jun 2021 9:00 PM IST
నేషనల్ అవార్డు విన్నర్తో బడా ప్రొడ్యూసర్ భారీ సినిమా..?
X
తమిళ స్టార్ హీరో ధనుష్ తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన సంగతి తెలిసిందే. ధనుష్ నటించిన 3, రఘువరన్ బీటెక్, మారి లాంటి సినిమాలు తెలుగులో అతనికి సూపర్ క్రేజ్ తీసుకొచ్చాయి. అప్పటినుండి వరుసగా తన సినిమాలను తెలుగులోకి డబ్ చేస్తున్నాడు. ప్రస్తుతం ధనుష్ నటించిన కొత్త సినిమా 'జగమే తంతిరమ్‌'. ఈ సినిమా తెలుగులో 'జగమే తంత్రం' పేరుతో విడుదల కాబోతుంది. యువదర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఐశ్వర్యలక్ష్మి కథానాయికగా నటిస్తుంది. గతేడాది వేసవిలోనే సినిమా మోషన్‌ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

ఈ సినిమాలో ధనుష్‌ గెటప్‌ డిఫరెంట్ గా ఉండబోతుందని తాజాగా ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. ఈ సినిమా జూన్ 18నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఇదిలా ఉండగా.. ధనుష్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే హిందీలో ఆత్రంగిరే సినిమా ఫినిష్ చేసేసాడు. ఆ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. అలాగే యంగ్ డైరెక్టర్ కార్తీక్ నరేన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. హిందీ తమిళంతో పాటు ధనుష్ హాలీవుడ్ లో గ్రేమ్యాన్ అనే ప్రాజెక్ట్ చేస్తున్నాడు! అయితే తెలుగులో ధనుష్ నటించే సినిమాలన్ని డబ్ అవుతున్నాయి. అలాగే కొన్ని రీమేక్ కూడా అవుతున్నాయి.

ఇదిలా ఉండగా.. ధనుష్ త్వరలోనే తెలుగులో డైరెక్ట్ ఫిల్మ్ చేయనున్నట్లు టాక్ నడుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం టాలీవుడ్ లో ధనుష్ సినిమాలకు ఫ్యాన్స్ బాగానే ఉన్నారు. ఆయన సినిమాలు తెలుగులో డబ్ అవ్వకపోయినా తమిళ వెర్షన్స్ చూసేలా జనాలు అట్ట్రాక్ట్ అయిపోయారు. ఎందుకంటే ఈ ఏడాది కూడా ధనుష్ అసురన్ సినిమాకు నేషనల్ అవార్డు అందుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ ధనుష్ తో స్ట్రెయిట్ తెలుగు సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఆయన ఎవరో కాదు ప్రొడ్యూసర్ దిల్ రాజు.. ప్రస్తుతం ధనుష్ - ఓ స్టార్ డైరెక్టర్ కాంబినేషన్ లో సినిమా రూపొందించే ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే దిల్ రాజు వేరే భాషల్లో కూడా నిర్మాణం ప్రయోగాలు చేస్తున్నాడు. కాబట్టి తెలుగులో హీరోలు డేట్స్ ఖాళీ లేకపోవడంతో ధనుష్ వైపు లుక్కు వేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. చూడాలి మరి ఈ కాంబినేషన్ సెట్ అవుతుందేమో!