Begin typing your search above and press return to search.

ఎగ్జిబిటర్లను కన్ ఫ్యూజ్ చేసి ముంచుతున్నారట!

By:  Tupaki Desk   |   31 Jan 2020 12:43 PM IST
ఎగ్జిబిటర్లను కన్ ఫ్యూజ్ చేసి ముంచుతున్నారట!
X
అదో నిర్మాతకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీ. సినిమాల నిర్మాణం.. పంపిణీ రంగంలో ఆయనకు అపార అనుభవం ఉండడంతో ఆయన మాట చాలాసార్లు చెల్లుబాటు అవుతుంది. అయితే దీన్ని అలుసుగా తీసుకుని తమ పెట్టుబడి తిరిగి రాబట్టుకునేందుకు.. సేఫ్ జోన్ లోకి వచ్చేందుకు ఒక గేమ్ ప్లే చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీ ఉత్తరాంధ్ర ప్రాంతంలో రెగ్యులర్ గా సినిమాలను విడుదల చేస్తూ ఉంటుంది. అంతే కాకుండా నిర్మాతలకు.. ఎగ్జిబిటర్లకు వారధిలా పనిచేస్తూ మధ్యవర్తిత్వం చేస్తారు. అయితే ఇక్కడే ఒక తిరకాసు ఉంది. ఎగ్జిబిటర్లకు ఇచ్చే ఎమౌంట్ల లెక్కలు నిర్మాతలకు తెలియకుండా.. నిర్మాతలు ఇచ్చే రెంటల్ ఫిగర్స్ ఎగ్జిబిటర్లకు తెలియకుండా మేనేజ్ చేస్తున్నారట. దీంతో ఆ రెండు పార్టీలకు నష్టం.. ఈ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీకి మాత్రం లాభం.

మొదట్లో ఈ గేమ్ అటు నిర్మాతలకు.. ఇటు ఎగ్జిబిటర్లకు తెలియకుండా సాగిందట. కానీ ఇప్పుడు మాత్రం ఇదో ఓపెన్ సీక్రెట్ గా మారిందని సమాచారం. అయినా తమకున్న పరిమితుల కారణంగా మింగలేక కక్కలేక అన్నట్టుగా నిర్మాతలు.. ఎగ్జిబిటర్లు ఊరుకుంటున్నారట. అయితే ఎగ్జిబిటర్లను కన్ఫ్యూజ్ చేసి డ్రామాలు అడుతున్నారనే విషయం ఈమధ్య ఫిలింనగర్ లో కూడా విపరీతంగా ప్రచారం అయిందట. ఇంత జరుగుతున్నా సదరు డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీ మాత్రం తమ తీరు మార్చుకోకుండా అదేరకంగా వ్యవహరిస్తోందట. మంచోళ్లకంటే మంచోళ్ల సంచులు ఎత్తుకుపోయే దొంగమారాజులకే ఎప్పుడూ టైమ్ అనుకూలంగా ఉంటుందని ఈ సంగతి తెలిసిన వారు కామెంట్ చేస్తున్నారు.