Begin typing your search above and press return to search.

ప్రభాస్ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కోసం భారీ ప్లాన్స్..!

By:  Tupaki Desk   |   29 May 2021 12:30 PM GMT
ప్రభాస్ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కోసం భారీ ప్లాన్స్..!
X
పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్ - ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ కాంబినేషన్ లో ఓ పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. స్టార్ క్యాస్టింగ్ తో హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందించే ఈ చిత్రాన్ని భారతీయ భాషలతో పాటు పలు విదేశీ భాషల్లో కూడా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే నాగ్ అశ్విన్ ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే ను ఎంపిక చేశారు. అలానే కీలక పాత్ర కోసం బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ని తీసుకున్నారు.

ఇదే క్రమంలో మరికొందరు బాలీవుడ్ స్టార్స్ ని ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకురావాలని నాగ్ అశ్విన్ ఆలోచిస్తున్నారట. ఇందులో ప్రతినాయకుడి పాత్ర కోసం ఇటీవలే ఓ బాలీవుడ్ స్టార్ ని సంప్రదించారని బీ టౌన్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు ఇందులో మరో ఐదారుగురు ప్రముఖ హిందీ ఇండస్ట్రీ నటీనటులు నటించే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. పాన్ వరల్డ్ మూవీ కావడంతో పలు ఇతర ఇండస్ట్రీల స్టార్స్ తోపాటుగా విదేశీ నటులను కూడా తీసుకోవాలని డైరెక్టర్ ఆలోచిస్తున్నారట.

ఇకపోతే ఈ చిత్రాన్ని సైన్స్ ఫిక్షన్ జోనర్ లో మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో రూపొందించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ప్రీ ప్రొడక్షన్ - విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని మేకర్స్ చెప్తున్నారట. దీనికి లెజండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్ మెంటర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న 'సలార్' 'ఆదిపురుష్' సినిమాల షూటింగ్స్ పూర్తయిన వెంటనే నాగ్ అశ్విన్ సినిమా ప్రారంభం కానుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు.