Begin typing your search above and press return to search.

ఆ నాలుగు దాచేస్తే దాగునా.. ఏంటి గురూ?

By:  Tupaki Desk   |   18 Aug 2021 1:14 PM IST
ఆ నాలుగు దాచేస్తే దాగునా.. ఏంటి గురూ?
X
గుట్టు చ‌ప్పుడు కాకుండా ఓటీటీల్లో రిలీజ్ చేయ‌డం కొత్త ట్రెండ్ గా మారుతోందా? అంటే అవున‌నే గుస‌గుస వినిపిస్తోంది. తెలంగాణ ఫ‌లింఛాంబర్ సీరియ‌స్ వార్నింగ్ నేప‌థ్యంలో కొంద‌రు ఓటీటీ రిలీజ్ ల విష‌య‌మై సంశ‌యిస్తున్నారు. అలాగ‌ని ఓటీటీలు వ‌దిలి థియేట‌ర్ల‌కు వ‌స్తున్నారా? అంటే అదీ లేదు. త‌మకు వ‌చ్చిన క్రేజీ డీల్స్ ని క్యాన్సిల్ చేసుకునే ఆలోచ‌న‌ల‌తో ఎవ‌రూ లేరు. డి.సురేష్ బాబు మొద‌లు ఇత‌ర నిర్మాత‌లు ఇదే పంథాలో ఉన్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

క‌రోనా రాక‌తో సీన్ మొత్తం రివ‌ర్స్ అయిన సంగ‌తి తెలిసిన‌దే. థియేట‌ర్లు మూత ప‌డ‌టంతో నిర్మాత‌లంతా ఓటీటీల‌వైపు వెళ్లిపోవ‌డంతో ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. నిర్మాత బిజినెస్ అనే ఒకే ఒక్క‌ కోణంలో ఓటీటీల‌తో బిజినెస్ డీల్ ముగించుకుని సైలెంట్ అయిపోతున్నారు. త‌మ సినిమా రిలీజ‌వుతుందో లేదో కూడా ప్ర‌చారం లేదు. సైలెంటుగా విడుద‌లైపోతున్నాయి.

అయితే ఎగ్జ‌బిట‌ర్లు ఈ విధానాన్ని వ్య‌తిరేకించడంతో నిర్మాత‌లు మ‌రింత కామ్ గా ఓటీటీల‌తో ఒప్పందాలు చేసుకుని కంటెట్ ని అంగే సైలెంట్ గా స్ట్రీమింగ్ వేదిక‌ల‌కు తోసేస్తున్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో నిర్మాత‌లంతా ఓటీటీ రిలీజ్ కు వెళ్ల‌డం వెనుక కార‌ణాలు లేక‌పోలేదు. థ‌ర్డ్ వేవ్ ముప్పు భ‌యం ఒక‌వైపు ఏపీలో టిక్కెట్టు రేటు తేల‌క‌పోవ‌డం ఇంకో వైపు స‌మ‌స్యాత్మ‌కం అవ్వ‌డ‌మే దీనికి కార‌ణం.

అయితే ఇండ‌స్ట్రీలో ఆ నాలుగు సినిమాల విష‌యంలో నిర్మాత‌లు మ‌రీ దాగుడుమూత‌లు ఆడేయ‌డం చ‌ర్చ‌కు వ‌చ్చింది. వీరంతా అన్ని విష‌యాలు దాచేస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. నాని న‌టించిన `ట‌క్ జ‌గ‌దీష్`..రానా న‌టించిన `విరాటపర్వం`... వెంక‌టేష్ న‌టించిన `దృశ్యం-2`.. నితిన్ న‌టించిన‌ `మాస్ట్రో` తెలుగులో థియేట‌ర్ల‌కు రావాల్సిన‌ క్రేజీ చిత్రాలు. ఇవ‌న్నీ షూటింగ్ స‌హా అన్ని ప‌నులు పూర్తిచేసుకుని రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. కానీ వీటి గురించి ఎక్క‌డా ఎలాంటి అప్ డేట్ కూడా లేదు. క‌నీసం సోష‌ల్ మీడియాకి కూడా ఉప్పందించ‌లేదు. ఒక పోస్ట‌ర్ లేదు..సాంగ్ రిలీజ్ చేయ‌లేదు. టీజ‌ర్ లేదు.. ట్రైల‌ర్ రిలీజ్ హ‌డావుడి లేదు. ఇలా ఏమీ లేకుండా సినిమాలు ఓటీటీలో రిలీజ్ కు రెడీ అవుతున్నాయన్న గుస‌గుస వినిపిస్తోంది.

ఇవ‌న్నీఇప్ప‌టికే ఓటీటీలో బిజినెస్ డీల్ క్లోజ్ చేసిన‌ట్లు క‌థ‌నాలొచ్చాయి. అయితే దీనికి ఎగ్జిబిట‌ర్లు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తారు అన్న కార‌ణంగా నిర్మాత‌లు ఎలాంటి ప్ర‌చారం లేకుండా మార్కెట్ లోకి వ‌దిలేస్తున్న‌ట్లు టాక్ వినిపిస్తుంది. నిర్మాత‌ల వ‌ర‌కూ సేఫ్ గానే గేమ్ న‌డిపించేస్తున్నా కానీ ఈ సినిమాల‌కు బ‌జ్ లేకుండా వ‌దిలేయ‌డం ఓటీటీల‌కు ముప్పు తెస్తుంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఎలాంటి ప్ర‌చారం నిర్వ‌హించ‌క‌పోవ‌డం వ‌ల్ల సినిమాపై హైప్ క్రియేట్ అవ్వ‌లేదు. ప్రేక్ష‌కుల్లో ఇప్ప‌టివ‌ర‌కూ ఏమాత్రం క్యూరియాసిటీ లేదు. ఇవ‌న్నీ కేవ‌లం సినిమాకు ప్ర‌చారం మాత్ర‌మే తెచ్చి పెడ‌తాయి. ఓటీటీ రిలీజ్ అంటే హీరోల ఇమేజ్ కి ప్ర‌మాదం వాటిల్లే అవ‌కాశం ఉంది. ఇలాగే కొన‌సాగితే ఓటీటీ ఆఫ‌ర్లు త‌గ్గించేస్తుంది. థియేట్రిక‌ల్ రిలీజ్ లేక‌పోయినా అర‌కొర‌క‌గా డిజిట‌ల్ ప్ర‌మోష‌న్స్ చేసినా.. లేదా వెబ్ ప‌త్రికా ఇ- మీడియాల్లో ప్ర‌చారం చేసినా రీచ‌బిలిటీ దక్కేది. గుట్టు చ‌ప్పుడు కాకూడ‌దు అంటే పెనుముప్పే. మ‌రి ఇక‌నైనా రూట్ మార్చి ప్ర‌చారం ప‌రంగా ఆలోచ‌నేమైనా చేస్తారేమో చూడాలి. ఆ నాలుగూ క్రేజు ఉన్న సినిమాలే .. కానీ దాచేయ‌డం వ‌ల్ల ఒరిగేదేమీ ఉండ‌ద‌ని కూడా విశ్లేషిస్తున్నారు. ప్ర‌చారాన్ని బ‌ట్టే ఓటీటీ వేదిక అయినా స‌క్సెస్ సాధ్య‌మ‌ని సూచిస్తున్నారు.