Begin typing your search above and press return to search.
ఆ 50 మందికి చుక్కలు చూపించిన ఓటీటీ దిగ్గజాలు
By: Tupaki Desk | 21 Oct 2020 4:20 PM ISTప్రస్తుతం పెద్ద తెర మూతపడడంతో బుల్లితెర ఓటీటీల హవా సాగుతోంది. ముఖ్యంగా ఓటీటీలకు అన్నివిధాలుగానూ మహమ్మారీ ఎంతో మేలు చేసిందనే చెప్పాలి. లాక్ డౌన్ కాలంలో అమెజాన్ .. నెట్‌ఫ్లిక్స్ సహా ఇతర OTT ప్లాట్ ఫామ్ లు అనూహ్యంగా పుంజుకున్నాయి. భారీగా సబ్ స్క్రైబర్లను చేర్చుకున్నాయి. ఇక వీటిలో చాలా పెద్ద సినిమాలు రిలీజైపోతుంటే అంతకంతకు ఓటీటీవైపు మొగ్గు చూపేవాళ్లు పెరిగారు. అలాగే ఓటీటీలకు నిర్మాతలు తమ సినిమాలను మంచి మొత్తానికి అమ్ముతున్నారు. ఈ క్రైసిస్ కాలంలో తమను తాము నష్టాల నుండి కాపాడుకుంటున్నారు.
కానీ ఇటీవల విడుదలైన చాలా చిత్రాలలో బడా సినిమాలన్నీ ఆదరణకు నోచుకోక బిగ్ పంచ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. చాలా చిత్రాలు క్రేజీ అనుకున్నవి మంచి ప్రమోషన్ తో రిలీజైనవి కూడా ప్రేక్షకులను అలరించడంలో విఫలమయ్యాయి. వి- పెంగ్విన్ - నిశ్వబ్ధం సహా పలు చిత్రాలు వందశాతం మెప్పించడంలో విఫలమయ్యాయి. ఇక ఇలా వచ్చినవి ఇండస్ట్రీ పెద్దలు క్రిటిక్స్ నుంచి ప్రశంసలను పొందడంలో విఫలమయ్యాయి. ఇది OTT దిగ్గజాలను పునరాలోచనలో పడేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
అమెజాన్ - నెట్‌ఫ్లిక్స్ వంటి OTT దిగ్గజాలు గత నెలలో కనీసం 50 దక్షిణాది చిత్రాలను కొనేందుకు ఆసక్తిని చూపించలేదని పెద్ద మొత్తంలో తిరస్కరించాయని తెలుస్తోంది. తాము చెల్లించే మొత్తాలను తిరిగి రాబట్టేంత గొప్ప కంటెంట్ లేదని చేతులెత్తేశాయిట. అంత మంచి నాణ్యత కలిగి లేకపోవడం వల్లనే ఓటీటీలు తిరస్కరించాయని తెలుస్తోంది. అంతేకాదు.. మీ మూవీ బడ్జెట్ ఎంత? అంటూ..ఈ OTT దిగ్గజాలు బడ్జెట్ వివరాలను డిమాండ్ చేస్తున్నాయని అందువల్ల వారు ఈ చిత్రం కోసం ఎంత ఖర్చు చేయవచ్చో విశ్లేషిస్తున్నారని వెల్లడైంది. తాజా సన్నివేశంలో పెద్ద బ్యానర్లు ... పెద్ద స్టార్లతో తీసిన సినిమాలకు మాత్రమే ఓటీటీలో మైలేజ్ దక్కనుందని అర్థమైనట్టే. నిర్మాతలు తమ సినిమాలను సులభంగా అమ్మగలగాలంటే చాలా వ్యూహాత్మకంగానే వ్యవహరించాల్సి ఉంటుందని తాజా పరిణామం స్పష్ఠం చేస్తోంది.