Begin typing your search above and press return to search.

ఆ హీరోలు సిల్క్ స్మితను వాడుకున్నారు

By:  Tupaki Desk   |   3 May 2019 11:00 PM IST
ఆ హీరోలు సిల్క్ స్మితను వాడుకున్నారు
X
ఒకప్పుడు టాలీవుడ్ హీరోలతో పాటు మరికొందరిపై శ్రీరెడ్డి చేసిన ఆరోపణలు ఎంతటి సంచలనం రేపాయో తెలిసిందే. ఒక దశలో ఆమె ఆరోపణలపై పెద్ద కలకలమే రేగింది. దీనిపై పెద్ద చర్చ కూడా నడిచింది. కానీ కొన్ని పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు, ఆరోపణలు చేయడం ద్వారా తనకు, తన మాటలకు విలువ లేకుండా చేసుకుంది శ్రీరెడ్డి. మధ్యలో ఆమె రకరకాల ఆరోపణలు చేసింది కానీ.. జనాలు పట్టించుకోలేదు. తాజాగా ఆమె మరోమారు సంచలన ఆరోపణలతో వార్తల్లో నిలిచే ప్రయత్నంచేసింది.

శ్రీరెడ్డి ఫోకస్ ప్రస్తుతం సిల్క్ స్మిత మీద పడింది. ఆమెకు సినీ పరిశ్రమలో తీవ్ర అన్యాయం జరిగిందంటూ శ్రీరెడ్డి కొత్తగా ఇప్పుడు ఆవేదన చెందుతుండటం విశేషం. సిల్క్ స్మితను టాలీవుడ్లో లెజెండ్స్ అనిపించుకున్న కొందరు హీరోలు శారీరకంగా వాడుకుని వదిలేశారని శ్రీరెడ్డి ఆరోపించింది. ఇలాంటి సైకో హీరోల వల్లే సిల్క్ స్మిత్ దెబ్బ తిందని.. సినిమా పరిశ్రమలో రాజకీయాల వల్లే ఆమె ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వచ్చిందని శ్రీరెడ్డి అంది. సిల్క్ స్మితకు ఇండస్ట్రీలో అన్యాయం జరిగితే జరిగి ఉండొచ్చేమో. కానీ సిల్క్ స్మిత లైమ్ లైట్లో ఉన్నప్పటికి శ్రీరెడ్డి పుట్టిందో లేదో కూడా తెలియదు. కానీ ఆమెకు జరిగిన అన్యాయం గురించి అన్నీ తెలిసిన వ్యక్తిలా ఇప్పుడు శ్రీరెడ్డి మాట్లాడుతుండటమే విడ్డూరం. కేవలం వార్తల్లో నిలవడానికే శ్రీరెడ్డి ప్రతిసారీ ఇలా ఒక టాపిక్ ఎంచుకుంటోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.