Begin typing your search above and press return to search.

శివరాత్రి బరిలో ఈ సినిమాల మధ్య బిగ్ ఫైట్..!

By:  Tupaki Desk   |   9 March 2021 6:30 AM GMT
శివరాత్రి బరిలో ఈ సినిమాల మధ్య బిగ్ ఫైట్..!
X
టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాల మధ్య పోరు మొదలైంది. ఎప్పుడైతే లాక్ డౌన్ ముగిసి థియేటర్స్ వందశాతం ఓపెన్ అయ్యాయో అప్పటినుండి కొత్త సినిమాల మధ్య పోటీ విపరీతంగా పెరిగింది. ఇప్పటికే చాలా సినిమాలు ప్రతి శుక్రవారం విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ప్రతి ఏడాది అసలు సీసన్.. అన్ సీజన్ అంటూ పిలిచేవారు. కానీ ఇప్పుడు అలా లేదు. పూర్తిగా సినీ ఇండస్ట్రీ సిస్టమ్ లాక్ డౌన్ పుణ్యమా అని మారిపోయింది. నిజానికి ఈ 2021 ఏడాదిలో ఒక్క శుక్రవారం కూడా ఖాళీగా లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఇప్పుడు వస్తున్న సినిమాలు ఇంతకుముందులా వంద రోజులు, యాభై రోజులపాటు థియేటర్లలో ఉండటం లేదు. కనీసం ఒక్కోసారి రెండు వారాలు కూడా నిలవడం లేదంటే అర్ధం చేసుకోవచ్చు.

సినీ ఇండస్ట్రీలో ఎన్ని మార్పులు చోటుచేసుకున్నాయో. అలాగే ఇప్పుడు ప్రతి శుక్రవారం మినిమం 5-10 సంఖ్యలో సినిమాలు విడుదల అవుతున్నాయి. మరి థియేటర్స్ విషయంలో తగ్గపోరు జరుగుతుంది. క్రాక్, ఉప్పెన సినిమాల కలెక్షన్స్ చూసి మిగతా సినిమాలకు ధైర్యం వచ్చింది. అయితే ఈసారి శుక్రవారం కాదు గాని గురువారం రోజు తగ్గపోరు జరగనుంది. ఎందుకంటే శివరాత్రి శుభదినం అని చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో ముఖ్యంగా శ్రీకారం, జాతిరత్నాలు, గాలిసంపత్ సినిమాలు మంచి బజ్ క్రియేట్ చేసుకున్నాయి. ఇందులో కాస్త పెద్ద సినిమా అంటే శ్రీకారం అనే చెప్పాలి. మీడియం, చిన్నసినిమా అంటే గాలిసంపత్, జాతిరత్నాలు వరుసలో నిలుస్తాయి. అయితే ఈ సినిమాలు వేటికవే హైప్ తో ఉన్నాయి. చూడాలి మరి శ్రీకారంతో గాలిసంపత్, జాతిరత్నాలు ఎలా ఫైట్ చేస్తాయో!