Begin typing your search above and press return to search.
పవన్-ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగే..
By: Tupaki Desk | 29 Dec 2020 2:00 PM ISTటాలీవుడ్ టాప్ స్టార్స్ ప్రభాస్, పవన్ కళ్యాణ్ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీస్.. ‘రాధే శ్యామ్’ మరియు ‘వకీల్ సాబ్’. ప్రస్తుతం ఈ రెండు చిత్రాల షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్లో ప్రభాస్ మూవీ తెరకెక్కుతోంది. పవన్ వకీల్ సాబ్ షూట్ కోసం విశాఖ మన్యం వెళ్లొచ్చారు. అయితే.. ఈ సినిమాలకు సంబంధించిన టీజర్లు మాత్రం ఇప్పటి వరకూ విడుదల కాలేదు.
ఈ రెండు చిత్రాల టీజర్ల కోసం వారి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు మూవీ మేకర్స్ ఒకటీ అరా హీరోల లుక్, ప్రచార పోస్టర్‌లను మాత్రమే విడుదల చేశారు. అయితే.. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. త్వరలో ఈ రెండు చిత్రాలకు సంబంధించిన టీజర్స్ రిలీజ్ అవుతాయట. బిగ్ ఫెస్టివల్ సంక్రాంతి పండుగ సందర్భంగా వీటిని విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారని టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనలు త్వరలో వెలువడుతాయని అంటున్నారు.
బాలీవుడ్ ‘పింక్’రీమేక్ చిత్రంగా వకీల్ సాబ్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పవర్ స్టార్ సరసన హ్యాట్రిక్ హీరోయిన్ శృతిహాసన్ నటిస్తోంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు.
‘రాధేశ్యామ్’ మూవీని ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. రూ. 140 కోట్ల బడ్జెట్‌తో ప్రభాస్ సొంత బ్యానర్ ‘గోపీకృష్ణ మూవీస్’తో పాటు ‘యూవీ క్రియేషన్స్’ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ రెండు సినిమాలూ వచ్చే ఏడాది వేసవిలో విడుదలకు సిద్ధమవుతున్నాయి.