Begin typing your search above and press return to search.

09-12-2021 - క‌త్రిన జీవితంలో బిగ్ డే

By:  Tupaki Desk   |   9 Dec 2021 5:32 AM GMT
09-12-2021 - క‌త్రిన జీవితంలో బిగ్ డే
X
అందాల మ‌ల్లీశ్వ‌రి అలియాస్ క‌త్రిన కైఫ్ బిగ్ డే నేడే.. 9డిసెంబ‌ర్ 2021 త‌న లైఫ్ లో మ‌ర్చిపోలేని రోజు. తాను వ‌ల‌చిన స‌ఖుడు విక్కీ కౌశ‌ల్ ని నేడు కుటుంబ స‌భ్యులు 120 మంది ప్ర‌త్యేక అతిథుల స‌మ‌క్షంలో పెళ్లాడుతున్న సంగ‌తి తెలిసిందే. రాజ‌స్థాన్ లోని విలాస‌వంత‌మైన వెన్యూ `సిక్స్ సెన్స్ బ‌ర్వారా` దీనికోసం అంగ‌రంగ వైభ‌వంగా ముస్తాబైంద‌ని ఇప్ప‌టికే క‌థ‌నాలొచ్చాయి. గ‌డిచిన కాలంలో హ‌ల్దీ .. సంగీత్ వేడుక‌లు ఇప్ప‌టికే ముగిసాయి. కానీ వాటి నుంచి స‌రైన ఫోటోలేవీ లీక్ కాలేదు. ఈ పెళ్లి అంతా ర‌హ‌స్యంగా జ‌రుగుతోంది. దానికి కార‌ణం వేడుక‌కు సంబంధించిన స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను ప్ర‌ముఖ ఓటీటీకి విక్ర‌యించ‌డ‌మేన‌ని గుస‌గుస వినిపిస్తోంది.

ప్ర‌ముఖ మీడియా క‌థ‌నం ప్ర‌కారం..ఈ జంట కుటుంబ సభ్యులతో కలిసి హల్దీ వేడుకను జరుపుకున్నారు. బాలీవుడ్ సంగీతంతో పూల్ సైడ్ సంగీత కార్యక్రమాన్ని ఆస్వాధించారు. సంగీత వేడుకలో వధూవరులు ట్రెండింగ్ డ్యాన్స్ పాటలపై ఉల్లాసంగా నృత్యం చేశారని తెలిసింది.

అయితే ఇన్ సైడ్ సోర్స్ ప్ర‌కారం.. కత్రినా కైఫ్ - విక్కీ కౌశల్ వివాహ వేడుకలో అతిథులు రాజస్థానీ- గుజరాతీ వంటకాలను ఆస్వాధించారని తెలిసింది.జనతా జోధ్‌పూర్ స్వీట్ హోమ్ కు చెందిన అర్జున్ ఉపాధ్యాయ మాట్లాడుతూ,-``జోధ్ పూర్‌లోని ప్రసిద్ధ వంటకం `మావా కచోరీ`.. బికనీర్ లోని `గోండ్ పాక్స్` రుచికి అతిథులు ముగ్ధులయ్యారు. అల్పాహారంలో గుజరాతీ ధోక్లా కూడా వడ్డించారు. సమోసా- కచోరీ-ధోక్లా హల్దీ వేడుక కోసం హోటల్ నుంచి పంపించారు`` అని తెలిపారు.

తాజా నివేదిక ప్రకారం.. ఈ జంట పంజాబీ పద్ధతిలో వివాహం జ‌రుపుకోనుంది. ఈ రోజు మధ్యాహ్నం ఈ వేడుక‌ ప్రారంభమవుతుంది. విక్కీ - కత్రినా మధ్యాహ్నం 3.30 నుండి 3.45 గంటల మధ్య సాథ్ ఫెరాస్ తీసుకుంటారు. తాళి క‌ట్టు శుభ ముహూర్తం ఎప్పుడు అన్న‌ది ఇప్ప‌టివ‌ర‌కూ రివీల్ కాలేదు. నేటి రాత్రి ఓ దివ్య‌మైన ముహూర్తానికి ఈ జంట ఒక‌టి కానుంద‌ని భావిస్తున్నారు.

అతిథులు ఎవ‌రెవ‌రు?

విక్కీ కౌశ‌ల్- క‌త్రిన కైఫ్ జంట పెళ్లికి 200 మందికి ఆహ్వానాలు అందాయి. ఇరువైపులా బంధుమిత్రులే ఇందులో ఎక్కువ‌గా క‌నిపిస్తారు. అయితే ఇండ‌స్ట్రీ నుంచి ఎవ‌రెవ‌రు ఉంటారు? అన్న‌దానిపై ఇంకా పూర్తి క్లారిటీ లేదు. విక్కీ.. క‌త్రిన‌ల‌కు అత్యంత స‌న్నిహితులు మాత్ర‌మే ఇండ‌స్ట్రీ నుంచి అటెండ‌వుతున్నార‌ట‌.

అయితే ఓ ఇద్ద‌రు స్టార్ హీరోల‌కు మాత్రం అస్స‌లు పిలుపు అన్న‌దే లేదు. కండ‌ల హీరో స‌ల్మాన్ ఖాన్ పేరుతో పాటు యువ‌హీరో ర‌ణ‌బీర్ క‌పూర్ ఈ పెళ్లికి అటెండ్ కారు. క‌త్రిన స‌ల్మాన్ భాయ్ కి లాంగ్ టైమ్ గాళ్ ఫ్రెండ్. స‌ల్మాన్ నుంచి బ్రేక‌ప్ అయ్యాక తిరిగి అత‌డితో స్నేహితురాలిగా మాత్ర‌మే కొన‌సాగుతూ సినిమాలు చేసేందుకు ప‌రిమిత‌మైంది. అలాగే ర‌ణ‌బీర్ క‌పూర్ తో క‌త్రిన ప్రేమాయ‌ణం గురించి తెలిసిందే. నాలుగేళ్ల పాటు ఈ జంట చెట్టాప‌ట్టాల్ అంటూ షికార్లు చేశారు. ఒకానొక ద‌శ‌లో పెళ్లి వ‌ర‌కూ వెళ్లారు అని టాక్ వినిపించినా చివ‌రికి ర‌ణ‌బీర్ వేరొక నాయిక‌తో డ‌బుల్ గేమ్ ఆడ‌డంతో అది కాస్తా బ్రేక‌ప్ అయ్యింది. ర‌ణ‌బీర్ ప్ర‌స్తుతం ఆలియాతో ప్రేమ‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆలియానే అత‌డు పెళ్లాడ‌తాడు. రాజ‌స్థాన మాధోపూర్ లో ఈ నెల 9న‌ 100కోట్ల బ‌డ్జెట్ తో అంగ‌రంగ వైభ‌వ‌మైన వెడ్డింగ్ గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇక విక్కీ - క్యాట్ పెళ్లికి టాలీవుడ్ నుంచి అటెండ‌వుతున్న ఏకైక హీరో విక్ట‌రీ వెంక‌టేష్ మాత్ర‌మేన‌ని గుస‌గుస వినిపించిన సంగ‌తి తెలిసిందే.