Begin typing your search above and press return to search.

మోనాల్‌ గురించి ఏదో పెద్ద విషయాన్ని బిగ్‌ బాస్‌ దాచేశాడు

By:  Tupaki Desk   |   3 Dec 2020 11:40 AM IST
మోనాల్‌ గురించి ఏదో పెద్ద విషయాన్ని బిగ్‌ బాస్‌ దాచేశాడు
X
బిగ్ బాస్‌ సీజన్‌ 4 ముగింపు దశకు వచ్చింది. ఈ సీజన్‌ లో అందరికి ఆశ్చర్యం కలిగిస్తున్న విషయం ఏంటీ అంటే మోనాల్‌ ను ఎందుకు బిగ్‌ బాస్‌ ఇన్నాళ్లుగా కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు. మోనాల్‌ కంటే ఎంతో మంది స్ట్రాంగ్‌ కంటెస్టెంట్స్‌ ఎలిమినేట్‌ అయ్యారు. మొన్నటికి మోన్న ఎలిమినేట్‌ అయిన లాస్య కూడా ఖచ్చితంగా మోనాల్‌ కంటే ఎక్కువ స్ట్రాంగ్‌ అంటూ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు ఓట్లు రాకున్నా కూడా నిర్వాహకులు కంటెంట్‌ ఆమె ఉంటేనే వస్తుందనే ఉద్దేశ్యంతో కంటిన్యూ చేస్తూ వస్తున్నారు.

మొదట్లో ఆమెను నూటికి నూరు శాతం కంటెంట్‌ కోసం కంటిన్యూ చేశారు అనేది అందరి మాట. అయితే గత రెండు మూడు వారాలుగా ఆమె కాస్త యాక్టివ్‌ గా కనిపిస్తుంది. ఆమె చాలా స్ట్రాంగ్‌ గా మారినట్లుగా అనిపించినా కూడా ఇతరుల కంటే స్ట్రాంగ్‌ అని మాత్రం చెప్పలేం. అయినా కూడా ఆమె కంటిన్యూ అవుతూనే ఉంది. ఇతరులకు చెందిన ఏ చిన్న బ్యాడ్‌ ఇష్యూను అయినా పెద్దగా చూపించేందుకు బిగ్‌ బాస్‌ ప్రయత్నించాడు. కాని మోనాల్‌ విషయంలో మాత్రం బిగ్‌ బాస్‌ చాలా ఫేవరేటిజంను చూపించినట్లుగా మరోసారి క్లీయర్‌ గా అర్థం అయ్యింది.

మోనాల్‌ విషయం నిన్నటి ఎపిసోడ్‌ లో ప్రముఖంగా చర్చకు వచ్చింది. మోనాల్‌ తనను పాల టాస్క్‌ లో తన్నింది అంటూ అవినాష్‌ అన్నాడు. సోహెల్‌ మాత్రం ఆమె తన్నలేదు అంటుంది అన్నాడు. అప్పుడు అభిజిత్‌ కల్పించుకుని ఆమె అబద్దాలు చెబుతుంది. ఎన్నో సార్లు అబద్దం చెప్పింది. మెహబూబ్‌ నాకు పోయే ముందు ఎందుకు క్లోజ్‌ అయ్యాడు అనుకుంటున్నావు. ఆమెతో మోహబూబ్‌ కు జరిగిన విషయం ఏంటో తెలుసా అన్నట్లుగా సోహెల్‌ తో ఏదో చెప్పబోయి అభిజిత్‌ గిపోయాడు. దాంతో మెహబూబ్‌ మరియు మోనాల్‌ కు మద్య ఏదో సీరియస్‌ గొడవే జరిగిందనిపిస్తుంది.

ఇద్దరి మద్య జరిగిన ఇష్యూ ఏంటీ అనేది బిగ్‌ బాస్‌ ఎందుకు చూపించలేదు. మోనాల్‌ ఆ గొడవ చూపిస్తే బ్యాడ్ అవుతుందనే ఉద్దేశ్యంతోనే చూపించలేదా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరీ ఇంతగా బిగ్‌ బాస్‌ ఆమెపై ఫెవరెటిజంను చూపిస్తున్నాడు అనేది అర్థం అవ్వడం లేదు అంటున్నారు.