Begin typing your search above and press return to search.

శ్రీముఖి క్లోజ్‌ ఫ్రెండ్‌ కు బిగ్‌ బాస్‌ ఛాన్స్‌

By:  Tupaki Desk   |   2 Aug 2020 4:50 AM GMT
శ్రీముఖి క్లోజ్‌ ఫ్రెండ్‌ కు బిగ్‌ బాస్‌ ఛాన్స్‌
X
తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 హంగామా ప్రారంభం అయ్యింది. ఈ నెల చివర్లో లేదా వచ్చే నెల ఆరంభంలో ప్రారంభించబోతున్నట్లుగా స్టార్‌ మా వర్గాల వారి నుండి ఇప్పటికే అనధికారిక ప్రకటన వచ్చేసింది. ఇక నాగార్జున తాజాగా సీజన్‌ 4 ప్రోమో షూట్‌ లో కూడా పాల్గొన్నాడు. ఆ ప్రోమో ఒకటి రెండు రోజుల్లో ప్రసారం కాబోతుంది. ఆ ప్రోమో విడుదల అయితే షో ఎప్పటి నుండి ప్రారంభం అయ్యేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సీజన్‌ కంటెస్టెంట్స్‌ గురించి ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈసారి ముద్దుగుమ్మలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వనున్నట్లుగా మొదటి నుండి ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే యాంకర్‌ విష్ణు ప్రియకు ఛాన్స్‌ దక్కినట్లుగా తెలుస్తోంది.

శ్రీముఖికి విష్ణు ప్రియ చాలా క్లోజ్‌ ఫ్రెండ్‌. శ్రీముఖి వల్లే విష్ణు ప్రియకు చాలా ఆఫర్లు వచ్చాయి అనేది బుల్లి తెర వర్గాల్లో టాక్‌. లాక్‌ డౌన్‌ టైంలో కూడా వీరిద్దరు కలిసి చేసిన వీడియోలు ఆ తర్వాత వీరు చేసిన ఫన్నీ డాన్స్‌ స్కిట్స్‌ అన్ని కూడా నెటిజన్స్‌ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఒకరిని ఒకరు బూతులు తిట్టుకోవడం ముద్దులు పెట్టుకోవడం చూస్తుంటే వీరి మద్య ఉన్న స్నేహం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ స్నేహంతోనే తనకున్న పరిచయాలతో విష్ణు ప్రియను బిగ్‌ బాస్‌ సీజన్‌ 4కు పంపించినట్లుగా తెలుస్తోంది. బిగ్‌ బాస్‌ సీజన్‌ 3 లో శ్రీముఖి రన్నరప్‌ గా నిలిచింది. రాహుల్‌ అదృష్టం కలిసి వచ్చి విజేత అయ్యాడు కాని శ్రీముఖి విన్నర్‌ గా పూర్తి అర్హత ఉన్న కంటెస్టెంట్‌ అంటూ అంతా అనుకున్నారు.

ఇప్పుడు ఆమె స్నేహితురాలు విష్ణు ప్రియ రంగంలోకి దిగబోతుందనే టాక్‌ వినిపిస్తుంది. విష్ణు ప్రియతో పాటు మరో యాంకర్‌ మంజుషా కూడా ఈసారి బిగ్‌ బాస్‌ హౌస్‌ లో సందడి చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరు కూడా హాట్‌ యాంకర్స్‌ గా గుర్తింపు దక్కించుకున్నారు. కనుక ప్రేక్షకులకు వీరితో ఫుల్‌ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. ముఖ్యంగా విష్ణు ప్రియ ఎనర్జి శ్రీముఖి స్థాయిలో ఉంటుంది. కనుక రచ్చ రచ్చ ఖాయం అంటున్నారు.