Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్ పాన్ ఇండియా ఆఫ‌ర్ల‌కు బిగ్ బూస్ట్!

By:  Tupaki Desk   |   27 March 2021 6:30 AM GMT
అల్లు అర్జున్ పాన్ ఇండియా ఆఫ‌ర్ల‌కు బిగ్ బూస్ట్!
X
ప్ర‌స్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల్లో పాన్ ఇండియా హీట్ అంత‌కంత‌కు రాజుకుపోతోంది. ప్రాంతీయ వాదాన్ని వ‌దిలి భాషా భేధంతో ప‌ని లేకుండా ఇండియా లెవ‌ల్ హీరో అనిపించుకోవాల‌న్న త‌ప‌న క‌నిపిస్తోంది. బాహుబ‌లి- సాహో చిత్రాల‌తో ప్ర‌భాస్ సాధించుకున్న‌ది తాము కూడా సాధించాల‌న్న పోటీవాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ విష‌యంలో ఇత‌రుల‌తో పోలిస్తే చాలా ముందుగా ఉన్నారు. ఇటీవ‌ల అతడు పాన్ ఇండియా అప్పీల్ కోసం పాకులాడుతున్న వైనం అభిమానుల్లో చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఇంత‌కుముందు స‌రైనోడు చిత్రాన్ని హిందీలోకి అనువ‌దించి యూట్యూబ్ లో రిలీజ్ చేయ‌డం వెన‌క పెద్ద ప్లానింగే ఉంది. ఆ సినిమాకి చ‌క్క‌ని ఆద‌ర‌ణ ద‌క్కింది. నాటి నుంచి అత‌డికి బాలీవుడ్ ఆడియెన్ కూడా క‌నెక్ట‌వుతున్నారు. బ‌న్ని సోష‌ల్ మీడియాలో అంద‌రికీ చేరువ కావ‌డంతో ప్ర‌తిదీ బాలీవుడ్ మీడియాలోనూ హాట్ టా‌పిక్ గా మారుతోంది.

2020 బ్లాక్ బ‌స్ట‌ర్ అల వైకుంఠ‌పుర‌ములో అతడి రేంజును పెంచింది. ఈ సినిమా నుంచి చార్ట్ బ‌స్ట‌ర్ సాంగ్స్ జాతీయ స్థాయిలో గొప్ప ప్రాచుర్యం పొంద‌డం తెలిసిందే. అందుకే ఇప్పుడు పుష్ప సినిమాతో అత‌డు హిందీ మార్కెట్లోకి ప్ర‌వేశించాల‌న్న క‌సితో ఉన్నాడు.

తాజాగా ప్ర‌ముఖ హిందీ టాబ్లాయిడ్ `బాలీవుడ్ లైఫ్` బ‌న్నీకి సౌత్ ఉత్త‌మ న‌టుడు అవార్డును క‌ట్ట‌బెట్టింది. అల వైకుంఠ‌పుర‌ములో న‌ట‌న‌కు గానూ ఈ పుర‌స్కారాన్ని అందిస్తోంది. అవార్డ్ స్టైలిష్ స్టార్ కి చ‌క్క‌ని గుర్తింపు. మునుముందు మ‌రిన్ని బాలీవుడ్ అవార్డుల్ని అందుకునే అవ‌కాశం ఉంది. అలాగే అత‌డి పేరు ప‌దే ప‌దే హిందీ స‌ర్కిల్స్ లోనూ వైర‌ల్ అవుతుందన‌డంలో సందేహ‌మేం లేదు. ఇది అత‌డి త‌దుప‌రి చిత్రాల‌కు పెద్ద బూస్ట్ ఇస్తుంద‌న్న న‌మ్మ‌కం పెరుగుతోంది.

బ‌న్ని న‌టిస్తున్న త‌దుప‌రి ప్రాజెక్టులను ఉత్తరాది అభిమానులు గమనిస్తున్నారని.. బాలీవుడ్ టాబ్లాయిడ్ లు కూడా ఆయనకు తగిన క్రెడిట్ ఇస్తున్నాయని తాజా స‌న్నివేశం చెబుతోంది. మొత్తానికి నెమ్మ‌దిగా బ‌న్ని త‌న మార్కెట్ ప‌రిధిని హిందీలో విస్త‌రించుకునే దిశ‌గా అడుగులు వేస్తున్నార‌ని దీనిని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు.