Begin typing your search above and press return to search.
ఐశ్వర్యారాయ్ ని అసహ్యించుకుంటానన్న బిగ్ బి కూతురు!?
By: Tupaki Desk | 4 Feb 2021 5:00 AM ISTబిగ్ బి కోడలుగా.. అభిషేక్ కి భార్యగా బచ్చన్ ల ఇంట అడుగుపెట్టిన ఐశ్వర్యారాయ్ పై అప్పట్లో బాలీవుడ్ మీడియాలో రకరకాల కథనాలు వేడెక్కించాయి. ఆ కథనాల సారాంశం ప్రకారం .... అత్త జయాబచ్చన్ తో కోడలు ఐష్ కి సరిపడడం లేదని.. అలాగే తన భర్త సోదరి అయిన శ్వేతానందా బచ్చన్ తోనూ సరిగా పొసగడం లేదని కథనాలు వేడెక్కించాయి.
ఐష్ వేరు కాపురం పెట్టేందుకు భర్తతో పోరుతోందని కూడా చాలాసార్లు కథనాలు హీట్ పుట్టించాయి. కానీ అవన్నీ పుకార్లేనని తర్వాత రుజువైంది. అందరు అత్తా కోడళ్ల మాదిరే.. అత్తా కోడళ్ల రుసరుసలు ఉన్నా మరీ అంత పెద్ద స్థాయి గొడవలేవీ కాదని చాలా సందర్భాల్లో బచ్చన్ ఫ్యామిలీ క్లారిటీనిచ్చే ప్రయత్నం చేసింది.
తాజాగా ఐశ్వర్య రాయ్ ను శ్వేతా నందా ద్వేషిస్తోందన్న కథనం మరోమారు హాట్ టాపిక్ గా మారింది. శ్వేతా నందా ఇంతకుముందు కాఫీ విత్ కరణ్ లో కనిపించినప్పుడు.. తన సోదరుడైన అభిషేక్ భార్య ఐశ్వర్య రాయ్ బచ్చన్ గురించి మాట్లాడుతూ.. తాను ఐష్ ని ద్వేషిస్తున్నానని సహిస్తున్నానని అనడం వేడెక్కించింది. ప్రేమిస్తున్నాను అంటూనే ద్వేషిస్తున్నానని రెండో కోణాన్ని బయటపెట్టారు శ్వేతా.
ఐశ్వర్య రాయ్ తనదైన ప్రతిభ కృషితో విజయాల నిచ్చెన ఎక్కినందుకు శ్వేత ప్రశంసించారు. ఐష్ ఒక స్వీయ-నిర్మిత మహిళ. బలమైన వ్యక్తిత్వం ఉన్న నటి.. అద్భుతమైన తల్లి అంటూ ప్రశంసలు కురిపించారు శ్వేతా. అయితే ఐశ్వర్య కాల్స్ కి మెసేజ్ లకు రిప్లయ్ ఇవ్వడాన్ని అసహ్యించుకుంటానని శ్వేతా అన్నారు. ఐశ్వర్యారాయ్ సమయ పాలనను శ్వేతా ప్రశంసించారు.
అభిషేక్ పై ప్రశ్నించగా.. కుటుంబం పట్ల తనకున్న భక్తిని ప్రేమిస్తున్నానని .. నమ్మకమైన అంకితమైన కుటుంబ వ్యక్తి అని అన్నారు. అతడిని అమితంగా ప్రేమిస్తున్నాను. ``ఒక కొడుకుగానే కాదు.. భర్తగా కూడా గొప్పవాడు`` అని ఆమె అన్నారు. శ్వేతా అమితాబ్ తో కలిసి కొన్ని వాణిజ్య ప్రకటనలలో నటించింది. ఆమె డిజైనర్ మోనిషా జైసింగ్ తో కలిసి MXS అనే ఫ్యాషన్ లేబుల్ వ్యాపారం నడిపిస్తున్నారు. తను రచయిత కూడా. ఆమె తొలి నవల `పారడైజ్ టవర్స్` ను 2018 లో విడుదల చేయగా బెస్ట్ సెల్లర్ గా నిలిచింది. ప్రఖ్యాత వోగ్ ఇండియా మ్యాగజైన్ కాలమిస్టుగా అనలిస్టుగానూ శ్వేతా పాపులర్.