Begin typing your search above and press return to search.

ఇంటిమేట్ సీన్స్ కు రీటేక్స్ అడిగిందట

By:  Tupaki Desk   |   29 Aug 2017 5:59 AM GMT
ఇంటిమేట్ సీన్స్ కు రీటేక్స్ అడిగిందట
X
నవాజుద్దీన్ సిద్దిఖీ నటించన బాలీవుడ్ రీసెంట్ రిలీజ్ బాబూమోషాయ్ బందూక్ బాజ్ మూవీకి అద్భుతమైన స్పందన వస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ మూవీలో నటించిన కొత్త నటి బిదితా బాగ్ యాక్టింగ్ కు జనాలు షాక్ తినేశారు. అసలు ఈ భామకు ఇదే మొదటి సినిమా అంటే నమ్మలేని రేంజ్ లో బిదితా బాగ్ ఇరగదీసేసింది.

తన పాత్రకు న్యాయం చేసేందుకు ఎంతో ట్యాలెంట్ చూపించిన బిదితా బాగ్ కు ఇప్పుడు విపరీతమైన ప్రశంసలు వచ్చేస్తున్నాయి. ఇండస్ట్రీ జనాలు కూడా ఈమె ప్రతిభను బాగానే గుర్తించారు. ముఖ్యంగా బోల్డ్ సీన్స్ విషయంలో ఈమె నటనా పటిమకు అందరూ ముగ్ధులైపోయారు. ఈ విషయంపై రియాక్ట్ అయేందుకు కూడా ఏ మాత్రం సందేహించలేదు బిదితా బాగ్. "ఇలాంటి సన్నివేశాలు ఉంటాయనే విషయం నాకు ముందుగానే తెలుసు. డైరెక్టర్ ఈ విషయాన్ని నేరేషన్ సమయంలోనే చాలా క్లియర్ గా చెప్పారు. ఇంటిమేట్ సీన్స్ చేసేటపుడు.. కొన్ని సార్లు ఆ సీన్ సరిగా రాలేదనే ఉద్దేశ్యంతో నేనే రీటేక్స్ అడిగి మరీ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ కేరక్టర్ కు న్యాయం జరగాలని.. వాస్తవంగా కనిపించాలనే ఉద్దేశ్యంతోనే అలా చేశాను" అని చెప్పింది బిదితా బాగ్.

తను ఆయా సీన్స్.. ముద్దు సన్నివేశాలు చేసినపుడు.. ఎవరో చెబితే ముద్దు పెట్టుకుంటున్నట్లు కాకుండా.. తనే స్వయంగా ముద్దు అందిస్తున్నట్లుగా ఫీల్ అయ్యానని.. అందుకే ఆ పాత్రకు.. తన నటనకు ఇంతటి గుర్తింపు వస్తోందని తెగ సంబరపడిపోతోంది. ఏమైనా మొదటి సినిమాలోనే ఇంత ట్యాలెంట్ చూపించిందంటే.. ఈ భామకు బాలీవుడ్ నుంచి రెడ్ కార్పెట్ లభించేసినట్లే.