Begin typing your search above and press return to search.

20 కోట్లు పట్టుకుపోతున్న బిచ్చగాడు

By:  Tupaki Desk   |   22 Jun 2016 2:31 PM GMT
20 కోట్లు పట్టుకుపోతున్న బిచ్చగాడు
X
గతంలో రెండు డబ్బింగ్ సినిమాలు వచ్చినా జనాలకు అంతగా తెలియని హీరో.. తెలుగులో మొదటిసారి కనిపిస్తున్న హీరోయిన్.. ఏ మాత్రం కనెక్టింగ్ గా లేని పేరు.. ఇవన్నీ బిచ్చగాడు సొంతం. అయితే ఈ కామెంట్స్ అన్నీ కొన్నివారాల క్రితం మాత్రమే. ఇప్పుడు బిచ్చగాడు ఓ సెన్సేషన్. ముఖ్యంగా టాలీవుడ్ బాక్సాఫీస్ ని పిండేసిన సినిమా ఇది.

మే 13న విడుదలైన బిచ్చగాడు.. జూలై 1తో ఫిఫ్టీ డేస్ కంప్లీట్ చేసుకోబోతున్నాడు. కంటెంట్ కనెక్టింగా ఉంటే.. టాలీవుడ్ ఆడియన్స్ ఎలా కనెక్ట్ అవుతారన్నదానికి నిదర్శనంగా ఈ చిత్రం నిలుస్తోంది. ఇప్పటివరకూ బిచ్చగాడికి వచ్చిన మొత్తం వసూళ్లు ఎంతో తెలుసా? 16 కోట్ల రూపాయలు. ఇప్పటికీ థియేటర్స్ కౌంట్ పరంగా పెద్ద సినిమా మాదిరిగానే ఆడుతోంది.

ఏడో వారంలోకి ఎంటర్ అయినా.. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఈ బిచ్చగాడు దాదాపు 200 థియేటర్లలో ఆడుతోందని నిర్మాతలు చెబుతున్నారు. ఫుల్ రన్ లో 20కోట్ల రూపాయల క్లబ్ లోకి అడుగుపెట్టడం ఖాయమని ఇండస్ట్రీ జనాలు అంచనా వేస్తున్నారు. ఏ మాత్రం అంచనాలు లేని సినిమాగా విడుదలై.. ఈ స్థాయి విజయం సొంతం చేసుకున్న బిచ్చగాడు.. నిజంగా శ్రీమంతుడైపోయాడు.