Begin typing your search above and press return to search.

బిచ్చగాడికి 8 కోట్లు వేసేశారు

By:  Tupaki Desk   |   4 Jun 2016 12:45 PM GMT
బిచ్చగాడికి 8 కోట్లు వేసేశారు
X
బిచ్చగాడు.. కోలీవుడ్ మూవీ పిచ్చైక్కారన్ కి తెలుగు వెర్షన్ ఇది. ఈ ఏడాది మార్చ్ లో తమిళ్ లో విడుదలైన పిచ్చైక్కారన్ అక్కడ హిట్ కొట్టింది. విజయ్ యాంటోనీ నటించిన గత రెండు సినిమాలు ఇక్కడ ఫెయిల్ కావడంతో.. బిచ్చగాడుపై ఎలాంటి అంచనాలు లేవు. కనీసం ఆడియన్స్ లో ఆసక్తి కూడా లేదు. దీంతో కేవలం 50 లక్షల రూపాయలకు తెలుగు వెర్షన్ రైట్స్ ను కొనుగోలు చేసి విడుదల చేశారు. కానీ ఇప్పుడీ చిత్రం 8 కోట్ల రూపాయలను కొల్లగొట్టడం ఆశ్చర్యం కలిగించే విషయం.

సూర్య మూవీ 24కి తర్వాత, మహేష్ మూవీ బ్రహ్మోత్సవంకి ముందువారంలో రావడంతో.. అసలు బిచ్చగాడుని ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఈ సినిమాకి మౌత్ టాక్ బాగుండడంతో.. భారీ చిత్రాల మధ్యలో కూడా ధీమాగా నిలబడింది. కంటెంట్ స్ట్రాంగ్ గా ఉండడం సినిమాకి బాగా కలిసొచ్చింది. మే 13న విడుదలైన ఈ సినిమాకి జూన్ 3 నాటికి అంటే 21 రోజుల్లో 7.87 కోట్ల రూపాయల వసూళ్లు దక్కాయి.

బిచ్చగాడు మూవీకి మొదట్లో మల్టీప్లెక్స్ లు ఒక స్క్రీన్ కూడా ఇవ్వలేదు. కానీ ఇప్పుడు అంటే విడుదల తర్వాత 3 వారాలకు మల్టీప్లెక్స్ లలో షోస్ పడుతున్నాయంటే.. థియేటర్లకు జనాలు ఎలా వస్తున్నారో అర్ధమవుతుంది. ఫుల్ రన్ లో బిచ్చగాడు 10 కోట్లు రాబట్టేస్తాడని ఇండస్ట్రీ జనాలు అంచనా వేస్తుండడం విశేషం.