Begin typing your search above and press return to search.

బిచ్చగాడు.. హెడ్డింగ్ తప్పు రాజా...

By:  Tupaki Desk   |   28 Jun 2016 9:30 AM GMT
బిచ్చగాడు.. హెడ్డింగ్ తప్పు రాజా...
X

బిచ్చగాడు.. టాలీవుడ్ లో ఇప్పుడీ సినిమా సంచలనం. అన్ ఎక్స్ పెక్టెడ్ బ్లాక్ బస్టర్ అనే మాటకు సరైన అర్ధంగా బిచ్చగాడును చెప్పేయచ్చంటే ఏ రేంజ్ లో ఈ సినిమా సంచలనం సృష్టించిందో అర్ధమవుతుంది. ఇందుకు తగ్గట్లుగానే తగినంత ప్రచారం చేసి ఈ చిత్రాన్ని వీలైనంతగా మార్కెట్ చేస్తున్నారు నిర్మాతలు. ఇందుకోసం రకరకాల మార్గాలను కూడా వెతికేస్తున్నారు.

ఇప్పుడు మీడియాకి బిచ్చగాడు టీం ఓ ప్రెస్ నోట్ ఇచ్చి మరీ పబ్లిష్ చేయించుకుంది. అందులో ఉన్న కంటెంట్ యథాతథంగా.. అంటే వాళ్లు రాయించుకున్న స్క్రిప్ట్ అనేక వెబ్ సైట్ లో పడేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందులో చాలానే డీటైల్స్ ఉంటాయి. ఏరియాల వైజ్ గా కలెక్షన్స్ గురించి డీటైల్డ్ గా రాసుకొచ్చారు. అసలు ఈ నోట్ స్టార్టింగ్ లో కంటెంట్ ఉంటే కటౌట్ చాలు.. అంటూ పంచ్ డైలాగ్ తో మొదలుపెట్టారు. 'కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు' అంటూ గబ్బర్ సింగ్ లో పవన్ గురించి చెప్పిన పంచ్ ను ఇక్కడ వాడేసుకున్నారు.

అది కరెక్టే కానీ.. బిచ్చగాడులో కటౌట్ ఎవరిది ఉందో అర్ధం కాని విషయం. సినిమాలో కంటెంట్ ఉంటే కటౌట్ కూడా అర్ధం కాలేదని ప్రూవ్ చేసిన మూవీ బిచ్చగాడు. మరి డీటైల్డ్ రాయించుకున్న మేటర్ లో ఈవిషయం మర్చిపోయారు. రకరకాల ప్రమోషన్స్ చేసేసి.. ఇంకేం చేయాలో అర్ధం కాక ఇలా రాయించుకున్నట్లు ఉన్నారు నిర్మాతలు. ఇంతకీ వాళ్లిచ్చిన నోట్ ప్రకారం ఇప్పటికి బిచ్చగాడు 18కోట్ల వసూళ్లను దాటేసింది.