Begin typing your search above and press return to search.
ఈ బిచ్చగాడు దర్శకుడు అతగాడేనా??
By: Tupaki Desk | 7 Aug 2016 11:00 PM ISTఇప్పుడు బిచ్చగాడు దర్శకుడు శశి మన విక్టరీ వెంకటేష్ తో ఒక సినిమా చేయబోతున్నాడని ఆల్రెడీ చెప్పుకున్నాం. అయితే ఇక్కడే మనం ఓ విషయం తెలిస్తే షాకవుతాయం. ఈ దర్శకుడు వెంకీకి కొత్తగా పరిచయమైన ఒక ఫ్రెష్ అండ్ యంగ్ టాలెంట్ కాదండోయ్. ఇతగాడు గురించి తెలుసుకుంటే.. అతనా అని మీరు షాకవుతారు. పదండి తెలుసుకుందాం.
ఒకసారి టైమ్ 1999కు రివైండ్ చేయండి. అప్పట్లో 'శీను' అంటూ ఓ సినిమా వచ్చింది తెలుసా? అల్లో నేరేడు కళ్ళ దానా అంటూ మణిశర్మ కంపోజ్ చేసిన పాటలు.. వెంకీ మరియు ట్వింకిల్ ఖన్నా రొమాన్స్ రచ్చ రచ్చే. ఆ సినిమా యావరేజ్ గా ఆడినా కూడా.. తెలుగు ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోతుంది. ఆ సినిమా దర్శకుడే ఈ ''బిచ్చగాడు'' శశి. తమిళంలో తాను తీసిన సొల్లమే సినిమాను తెలుగులో వెంకీతో రీమేక్ చేశాడు. తరువాత మనోడు ''రోజా పూలు'' ''డిష్యూం'' ''పూ'' వంటి తమిళ సినిమాలతో (వీటిలో కొన్ని తెలుగులో కూడా రిలీజ్ అయ్యాయ్) అదరగొట్టాడు.
ఎక్కువ టైమ్ తీసుకుని ఒక సినిమాను తెరకెక్కించడం శశికి అలవాటు. ఆ మధ్యన ''555'' అంటూ ఒక సూపర్ లవ్ స్టోరీ తీశాక.. ''బిచ్చగాడు'' (తమిళంలో పిచ్చయకరన్) తీశాడు. సినిమాల్లో ఫ్రెష్ నెస్ ఉన్నప్పటికీ.. ఈ దర్శకుడు 1998 నుండి సినిమాలు తీస్తున్నాడంటే చూసుకోండి. పైగా వెంకీతో ఆల్రెడీ 17 ఏళ్ళ క్రితం సినిమాను తీసిన ఎక్స్ పీరియన్స్ కూడా ఉంది. చూద్దాం వీరి కాంబినేషన్లో సినిమా ఎంతవరకు సక్సెస్ సాధిస్తుందో.