Begin typing your search above and press return to search.
బిచ్చగాడు డైరెక్టర్.. నేరుగా తెలుగులో
By: Tupaki Desk | 12 May 2017 11:41 AM ISTగత ఏడాది ‘బిచ్చగాడు’ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ‘బ్రహ్మోత్సవం’ లాంటి భారీ సినిమా ‘బిచ్చగాడు’ ధాటికి కుదేలైంది. ఏకంగా రూ.25 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది ‘బిచ్చగాడు’. ఈ సినిమాను రూపొందించింది సీనియర్ దర్శకుడు శశి. ‘బిచ్చగాడు’ తర్వాత ఆయన ఇంకా తన తర్వాతి సినిమాను మొదలుపెట్టలేదు. ‘బిచ్చగాడు’ తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో ఈసారి ఆయన డైరెక్ట్ తెలుగు సినిమానే చేయాలని చూస్తున్నట్లు సమాచారం. ఓ తెలుగు హీరోకు కథ కూడా చెప్పాడట శశి.
తమిళంలో చాలామంది హీరోలు శశి కోసం వెయిటింగులో ఉన్నప్పటికీ శశి మాత్రం తెలుగులో సినిమా చేయడానికి ఆసక్తి చూపించడం విశేషమే. శశికి ఇక్కడ ప్రొడ్యూసర్ కూడా రెడీగా ఉన్నారట. త్వరలోనే శశి తెలుగు సినిమా గురించి ప్రకటన వచ్చే అవకాశముంది. శశి ఇంతకుముందే తెలుగులో ఓ సినిమా చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ‘శీను’ సినిమాకు ఆయనే దర్శకుడు. ఐతే దాని తమిళ వెర్షన్ ‘సొల్లామలై’ తరహాలో ఇది హిట్టవ్వలేదు. ‘బిచ్చగాడు’ చేయడానికి ముందు కొన్నేళ్ల పాటు శశి అడ్రస్ లేడు. ఆయన చాలా గ్యాప్ తీసుకుని.. తనకు నిజ జీవితంలో ఎదురైన అనుభవాల్ని ఆధారంగా చేసుకుని.. బిచ్చగాళ్ల జీవితాల్ని అధ్యయనం చేసి ‘పిచ్చైకారన్’ సినిమా తీశారు. అది తమిళంలో సూపర్ హిట్టయింది. తెలుగులో ‘బిచ్చగాడు’ పేరుతో అనువాదమై అంతకంటే పెద్ద విజయం సాధించింది
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/